చేనేత కార్మికుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసేందుకు రెడీ అయింది. చేనేత వృత్తిపై ఆధారపడిన కుటుంబాలకు ఆర్థిక ఊరట కలిగించేందుకు ‘నేతన్న సేవలో’ పథకాన్ని త్వరలోనే ప్రారంభించనుంది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 7న బాపట్ల జిల్లా చీరాల వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.

ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి ఏడాదికి రూ.25,000 ఆర్థిక సాయం నేరుగా అందనుంది. చేనేత రంగాన్ని పునరుద్ధరించడం, నేతన్నలు ఆత్మగౌరవంతో జీవించేలా చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.
‘నేతన్న సేవలో’ పథకం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై చేనేత, జ్యూట్ శాఖ మంత్రి ఎస్.సవిత సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జ్యూట్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసోడియాతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం నేతన్నల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అర్హత కలిగిన నేతన్నలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అర్హులైన చేనేత కార్మికులు ఆగస్టు 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా తమ దరఖాస్తులను తప్పనిసరిగా సమర్పించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అప్పుడే ఆగస్టు 7న నేరుగా వారి ఖాతాల్లో ఆర్థిక సాయం జమ అవుతుందని తెలిపారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు నేతన్నల లబ్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి వివరించారు. 50 ఏళ్లు దాటిన అర్హులైన చేనేత కార్మికులకు ‘ఎన్టీఆర్ భరోసా’ కింద నెలకు పింఛను సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.
చేనేత మగ్గాల నిర్వహణకు 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్‌లకు (Powerlooms) 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొ్న్నారు. అలాగే పొదుపు నిధి మద్దతు, ముద్రా రుణాలు వంటి ప్రయోజనాలను కూడా ప్రభుత్వం కల్పిస్తోందని ఆమె చెప్పారు.
{{/usCountry}}చేనేత మగ్గాల నిర్వహణకు 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్‌లకు (Powerlooms) 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొ్న్నారు. అలాగే పొదుపు నిధి మద్దతు, ముద్రా రుణాలు వంటి ప్రయోజనాలను కూడా ప్రభుత్వం కల్పిస్తోందని ఆమె చెప్పారు.
{{/usCountry}}ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు ప్రజల ప్రయోజనం కోసం అదనపు సంక్షేమ కార్యక్రమాలను కూడా ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని సవిత తెలిపారు. చేనేత కార్మికుల జీవనోపాధిని మెరుగుపరచడానికి, వారు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నేతన్న సేవలో పథకాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి వివరించారు.