50 రోజులు పూర్తి చేసుకున్న ఎల్‌జీబీటీ ఏ లీగల్ బ్యాటిల్- పార్ట్ 2కి ప్రభుత్వం నుంచి సహాయం- మంత్రి అడ్లూరి కామెంట్స్

LGBT A Legal Battle 50 Days Run Event: తెలుగులో ట్రాన్స్‌జెండర్స్‌పై తెరకెక్కిన సినిమా ఎల్‌జీబీటీ ఏ లీగల్ బ్యాటిల్. తాజాగా ఈ సినిమా 50 రోజులు థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ వేడుకలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Updated on: Aug 3, 2026, 16:56:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

LGBT A Legal Battle 50 Days Run Event: సామాజిక అంశాన్ని హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న 'ఎల్‌జీబీటీ – ఏ లీగల్ బ్యాటిల్' చిత్రం విజయవంతంగా 50 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ ఘనంగా విజయోత్సవ సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులతో పాటు పలువురు ప్రముఖులు హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు.

50 రోజులు పూర్తి చేసుకున్న ఎల్‌జీబీటీ ఏ లీగల్ బ్యాటిల్- పార్ట్ 2కి ప్రభుత్వం నుంచి సహాయం- మంత్రి అడ్లూరి కామెంట్స్
50 రోజులు పూర్తి చేసుకున్న ఎల్‌జీబీటీ ఏ లీగల్ బ్యాటిల్- పార్ట్ 2కి ప్రభుత్వం నుంచి సహాయం- మంత్రి అడ్లూరి కామెంట్స్

మంతి అడ్లూరి లక్ష్మణ్ కామెంట్స్

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ... ఈ సమాజంలో ట్రాన్స్‌జెండర్స్‌కు కూడా గౌరవప్రదమైన జీవితం ఉండాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన అని అన్నారు. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ట్రాన్స్‌జెండర్స్‌కు ప్రాధాన్యం కల్పిస్తోందని తెలిపారు. సమాజంలో అందరితో సమాన హక్కులు, అవకాశాలతో వారు ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

అలాగే ఈ చిత్రం సమాజానికి మంచి సందేశాన్ని అందిస్తోందని కొనియాడుతూ, 'ఎల్‌జీబీటీ – ఏ లీగల్ బ్యాటిల్ పార్ట్-2' నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు.

ప్రతి మనిషిని గౌరవించే భావన

ఈ సందర్భంగా దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... ప్రేక్షకులు తమ చిత్రాన్ని విశేషంగా ఆదరించి 50 రోజుల విజయాన్ని అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రం ద్వారా ప్రతి మనిషిని గౌరవించే భావన సమాజంలో పెరగాలని తాము కోరుకున్నామని, ప్రేక్షకులు ఆ సందేశాన్ని ఆదరించినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

నటుడు ఎల్‌బీ శ్రీరామ్ మాట్లాడుతూ... ఈ చిత్రం తనకు ఎంతో ప్రత్యేకమైందని, ఇందులో నటించడం గర్వంగా ఉందన్నారు. 50 రోజుల విజయాన్ని అందుకోవడం ఆనందంగా ఉందని, ప్రేక్షకుల ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు.

ఎప్పటికీ గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకం

చిత్రంలో తండ్రి పాత్రలో నటించిన ఆనంద్ చక్రపాణి మాట్లాడుతూ... ఇలాంటి మంచి సందేశాత్మక చిత్రంలో భాగమవడం సంతోషంగా ఉందని, 50 రోజుల విజయాన్ని అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. "నా సినీ జీవితంలో ఈ 50 రోజుల వేడుక ఎప్పటికీ గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకం. ప్రేక్షకులకు, చిత్ర బృందానికి కృతజ్ఞతలు" అని నటి హిమ తెలిపారు.

ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డిని అభినందిస్తూ, ఆయన నుంచి మరిన్ని మంచి సందేశాత్మక చిత్రాలు రావాలని ఆకాంక్షించారు. గ్రేడియంట్ ఇన్ఫోటైన్మెంట్ లిమిటెడ్ కంపెనీ అధినేత చిత్ర సమర్పకుడిగా విమల్ రాజ్ మాథుర్ ఈ చిత్రాన్ని హిందీలోకి అనువాద కార్యక్రమాలు ప్రారంభించామని త్వరలో చిత్రం ద్వితీయ భాగాన్ని తమ బ్యానర్ పై సమర్పిస్తున్నామని తెలియజేశారు.

ట్రాన్స్‌జెండర్స్ పట్ల అవగాహన పెంచింది

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మాదాల రవి ఈ చిత్రంలో నటించిన ట్రాన్స్‌జెండర్ కళాకారులకు మరిన్ని చిత్రాలలో అవకాశాలు లభించాలని ఆకాంక్షించారు. పోలీస్ శాఖకు చెందిన దాసు.. ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు పట్ల ఈ చిత్రం చాలా అవగాహన పెంచిందని తెలిపారు.

క్వీర్ బందు వ్యవస్థాపకురాలు ముకుంద మాల ఏ చిత్రానికి సహాయం అందించిన విద్యాసంస్థలకి , వివిధ స్వచంద సంస్థలకి ధన్యవాదాలు తెలిపారు. సందీప్ జైన్ మాట్లాడుతూ.. ప్రతి ఏడాది ఒక చిత్రం ఈ తరహాలో నిర్మించడానికి టీమ్‌కి తమ సహకారం అందిస్తానని తెలిపారు.

సినిమాలోని నటీనటులు

కాగా ఎల్‌జీబీటీ - ఏ లీగల్ బ్యాటిల్ చిత్రంలో నటించిన సోనా రాథోడ్, విష్ణు తేజ రమణ, టీ వీ రామన్, వంశీ , సాంకేతిక నిపుణులు ప్రతాప్ రెడ్డి, నాగరాజు, తేజ , సాయి ప్రసాద్, కోటి, డిస్ట్రిబ్యూటర్ బి బాపిరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అజయ్ అగర్వాల్, దర్శకులు వీఎన్ ఆదిత్య , చిన్ని కృష్ణ , షేక్ ఆమన్ తదితరులు చిత్ర బృందాన్ని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. చివరగా చిత్ర బృందం 50 రోజుల విజయానికి కారణమైన ప్రేక్షకులకు, మీడియాకు, తమకు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది చిత్రబృదం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More