రేపట్నుంచి కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ - గ్రామసభల ద్వారా అందజేత
భూముల రీసర్వే పూర్తి అయిన గ్రామాల్లో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేయనున్నారు. రేపట్నుంచే(జనవరి 2, 2026) ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర రెవెన్యూ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది.
రీసర్వే పూర్తయిన గ్రామాల్లో కొత్త పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. శుక్రవారం(జనవరి 2) నుంచి ఈ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది. జనవరి 2 నుంచి 9 వరకు రెవెన్యూ గ్రామసభలు నిర్వహించి… రైతులకు నూతన పాస్ బుక్ లను పంపిణీ చేస్తారు.

బొమ్మలు లేకుండానే…!
గతంలో ఇచ్చిన పట్టాదారు పుస్తకాలపై జగన్ ఫొటోలున్నాయి. అయితే తాజాగా ఇవ్వబోయే పట్టాదారు పాస్ పుస్తకాలపై ఎలాంటి ఫొటోలు ఉండవు. కేవలం రాజముద్ర, క్యూఆర్ కోడ్‌తో కొత్త పుస్తకాలను మాత్రమే పంపిణీ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే పూర్తి అయిన గ్రామాల్లో…. మొత్తం 21.80 లక్షల పుస్తకాల పంపిణీకి రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టింది.
గతంలో ఇచ్చిన 21.86 లక్షల భూహక్కు పత్రాల స్థానంలో రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు(పీపీబీ) పంపిణీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. వీటిపై ఎవరూ ఫొటోలు ఉండవు. ఇప్పటికే ముద్రణ పూర్తయిన పట్టాదారు పాస్‌పుస్తకాల్ని రైతులకు అందజేయనుంది.
పట్టాదారు పుస్తకంలో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలని రెవెన్యూశాఖ అధికారులకు స్పష్టం చేసింది. అందజేయకముందే తప్పులు సరిచూసుకోవాలని సూచించింది. వేలిముద్ర ద్వారా సంబంధిత పట్టాదారుకు కొత్త పుస్తకాలు అందించేలా చూడాలని సూచించింది. పంపిణీ ప్రక్రియ వీఆర్వో ఆన్‌లైన్ ఈకేవైసీ ద్వారా నిర్వహించాలని పేర్కొంది. కొత్తవి పంపిణీ చేస్తున్న నేపథ్యంలో పాత భూహక్కు పత్రాలు(బీహెచ్‌పీ) వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూశాఖ ఆదేశించింది.
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భూముల రీసర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తి అయింది. అంతేకాకుండా గతంలో ఉన్న పాసు పుస్తకాలను కూడా రద్దు చేయగా…. కొత్త వాటిని పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇదే విషయంపై చాలా రోజులుగా కసరత్తు చేస్తూ వస్తోంది. ఇప్పటికే రీసర్వే పూర్తి అయిన భూములకు కొత్త పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేయనుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

