...
...
Next Story

బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్‌ : నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డులు

బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్‌పై ఎన్‌హెచ్ఏఐ నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సృష్టించింది. ఇప్పటికే రెండు క్రియేట్ అవ్వగా.. తాజాగా మరో రెండు రికార్డులు నమోదు అయ్యాయి.

Published on: Jan 11, 2026, 21:54:53 IST
Advertisement

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) బెంగళూరు-కడప-విజయవాడ ఆర్థిక కారిడార్(NH-544G) అమలులో నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లను విజయవంతంగా సృష్టించింది. ఇది నేషనల్ హైవేస్ ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని తెలియపరుస్తుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

జనవరి 6, 2026న అధికారిక విడుదల ప్రకారం, ఎన్‌హెచ్ఏఐ పుట్టపర్తి సమీపంలో రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లను సృష్టించింది. మొదటిది 24 గంటల వ్యవధిలో 28.89 కి.మీ తారు రోడ్డు నిర్మించడం. రెండో రికార్డు 24 గంటల్లో అత్యధికంగా 10,655 మెట్రిక్ టన్నుల బిటుమినస్‌ కాంక్రీట్‌ (కంకర, తారు) వేయడం. ఎకనామిక్ కారిడార్‌లో ఆరు-లేన్ల జాతీయ రహదారి ప్రాజెక్ట్ కింద రెండు రికార్డులు మొదటిసారిగా నమోదు అయ్యాయి.

ఇదే ఊపు మీద జనవరి 11, 2026న మరో రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లు క్రియేట్ అయ్యాయి. దీనితో మెుత్తం నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డులు నమోదైనట్టు. తాజాగా అయిన మూడో రికార్డు 57,500 టన్నుల బిటుమినస్ కాంక్రిట్ నిరంతరం వేయడం, నాలుగో రికార్డు 156-లేన్ కి.మీ లేదా 3-లేన్ల వెడల్పు 52-కిమీ-పొడవు నిరంతర చదును చేయడం ఉన్నాయి. ఇది మునుపటి 84.40-లేన్ల కిమీ లేదా 2-లేన్ల వెడల్పు 42.20-కిమీ-పొడవు రికార్డును అధిగమించింది.

ఎన్‌హెచ్ఏఐ కన్సెషనర్ రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి 70 టిప్పర్లు, ఐదు హాట్ మిక్స్ ప్లాంట్లు, ఒక పేవర్, 17 రోలర్‌లతో కూడిన అత్యాధునిక నిర్మాణ పరికరాలు, యంత్రాలను మోహరించడం ద్వారా ఈ రికార్డులను సృష్టించింది నేషనల్ హైవేస్.

నాణ్యత నియమాలను పాటిస్తూనే ఈ రికార్డు సృష్టించారు. IIT-బాంబేతో సహా ప్రముఖ సంస్థల సహాయంతో నాణ్యతను పర్యవేక్షించారు. తద్వారా నాణ్యత, సేఫ్టీ ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా చూసుకున్నారు. 343 కి.మీ పొడవున్న యాక్సెస్-కంట్రోల్ ఆరు లేన్ల బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్ సురక్షితమైన, హై స్పీడ్ ప్రయాణంలో భాగంగా ఉంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks