AP Grama Panchayat Elections 2026 : గ్రామీణ రాజకీయాల్లో కీలక ఘట్టం మొదలైంది. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ దశలో ఎన్నికలు జరుగుతున్న 3,967 గ్రామ పంచాయతీలకు ఇవా(నవంబర్ 15) ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా 1,295 కేంద్రాలను యంత్రాంగం సిద్ధం చేసింది.

జనాభా ప్రాతిపదికన కేంద్రాల ఏర్పాటు పంచాయతీల జనాభాను బట్టి అధికారులు నామినేషన్ కేంద్రాలను విభజించారు. పది వేలకు పైగా జనాభా ఉన్న పెద్ద గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా ఒక నామినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అంతకంటే తక్కువ జనాభా కలిగిన చిన్న పంచాయతీల విషయంలో మాత్రం, మూడు లేదా నాలుగు పంచాయతీలను కలిపి ఒకే క్లస్టర్‌గా చేసి ఒక నామినేషన్ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు.
నవంబర్ 26న పోలింగ్…
తొలి దశ ఎన్నికల్లో భాగంగా 3,967 సర్పంచ్ స్థానాలతో పాటు 40,012 వార్డు సభ్యుల పదవులకు పోటీ జరగనుంది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నవంబర్ 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. దాఖలైన పత్రాలను నవంబర్ 18న అధికారులు పరిశీలిస్తారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై అభ్యర్థులు నవంబర్ 19, 20 తేదీల్లో అప్పీలు చేసుకోవచ్చు.
పోటీ నుంచి తప్పుకోవాలనుకునే వారికి నవంబర్ 21 మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణ గడువు ఇచ్చారు. అదే రోజు సాయంత్రం బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. నవంబర్ 26న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఓటింగ్ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి… అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు. రీపోలింగ్ అవసరమైతే నవంబర్ 27న నిర్వహిస్తారు.
మరోవైపు నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘం కూడా పక్కాగా ఏర్పాట్లను పర్యవేక్షించే పనిలో ఉంది.
{{/usCountry}}మరోవైపు నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘం కూడా పక్కాగా ఏర్పాట్లను పర్యవేక్షించే పనిలో ఉంది.
{{/usCountry}}ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 16న నోటిఫికేషన్ విడుదల కానుండగా నవంబర్ 20 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 24న ఉపసంహరణ గడువు ముగియనుండగా, నవంబర్ 29న పోలింగ్ మరియు ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.
మూడో విడత నవంబర్ 19న నోటిఫికేషన్ వెలువడనుండగా… నవంబర్ 23 నామినేషన్లకు చివరి తేదీ. నవంబర్ 27న ఉపసంహరణ అనంతరం, డిసెంబర్ 2న తుది విడత పోలింగ్, ఫలితాల వెల్లడి ఉంటుంది.