...
...
Next Story

ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 కోసం నామినేషన్లు.. పూర్తి వివరాలు!

భారతదేశంలోని బాలలకు ఇచ్చే అత్యున్నత పురస్కారం 'ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్'కు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. వివిధ రంగాలలో అసాధారణ ప్రతిభ కనబరిచిన చిన్నారులను గౌరవించేందుకు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏటా ఈ అవార్డులను అందజేస్తుంది.

Published on: May 28, 2026, 17:23:02 IST
Advertisement

ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ (PMRBP)-2026 కోసం ప్రతిభావంతులైన పిల్లలను గుర్తించడానికి విద్యా సంస్థలు, సంఘాలు, ప్రజలు ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (APSCHE) కోరింది. ఒక ప్రకటనలో APSCHE ఛైర్మన్ కె.మధు మూర్తి మాట్లాడారు. చాలా మంది అర్హులైన పిల్లల గురించి బయటకు రావడం లేదన్నారు. దీంతో వారిని తరచుగా గుర్తించబడకుండా పోతున్నారని, అటువంటి విజేతలను ప్రోత్సహించి, జాతీయ గుర్తింపు కోసం నామినేట్ చేయాలని అన్నారు.

ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026
ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026

PMRBP-2026 కోసం రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్(awards.gov.in) ద్వారా ఆన్‌లైన్ నామినేషన్లు, సిఫార్సులను ఆహ్వానిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది. భారత ప్రభుత్వం అందించే ఈ అవార్డుకు జూలై 31, 2026 నాటికి 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు అర్హులు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సాధించిన విజయాలను ఇది గుర్తిస్తుంది.

ఈ అవార్డులను ధైర్యం, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఆరు విభాగాలలో ప్రదానం చేస్తారు. ఆన్‌లైన్ నామినేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 1, 2026న ప్రారంభం కాగా, దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ జూలై 31, 2026గా నిర్ణయించారు.

అవార్డుల గురించి సమాచారాన్ని వ్యాప్తి చేయాలని, అలాగే జాతీయ గుర్తింపునకు అర్హమైన విజయాలు సాధించిన ప్రతిభావంతులైన పిల్లలను గుర్తించాలని ఉన్నత విద్యామండలి పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు, రాష్ట్ర విద్యా బోర్డులు, ఇతర సంస్థలకు ఏపీ ఉన్నత విద్యామండలి విజ్ఞప్తి చేసింది. సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన పిల్లలు వారి విజయాలు, సేవలకు గుర్తింపు పొందేలా చూడటమే ఈ కార్యక్రమం లక్ష్యమని కౌన్సిల్ తెలిపింది.

ఆసక్తి కలిగిన వారు 2026 జూలై 31 లోపు దరఖాస్తు చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ అధికారిక అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైనా పౌరుడు అర్హులైన పిల్లలను నామినేట్ చేయవచ్చు, లేదంటే పిల్లలు స్వయంగా తమ పేర్లను నామినేట్ చేసుకోవచ్చు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks