Oscars 2026: ఆస్కార్స్ విన్నర్స్.. గ్రాండ్ గా 98వ అకాాడమీ అవార్డుల ఈవెంట్
Oscars 2026: ఎట్టకేలకు నిరీక్షణ ముగిసింది. ప్రపంచ సినిమాకు పట్టం కట్టే ఆస్కార్స్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతోంది. 98వ అకాడమీ అవార్డుల్లో విన్నర్స్ ఎవరో ఓ లుక్కేయండి.
ప్రపంచంలో సినిమా రంగానికి చెందిన ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఆస్కార్ ను అందుకోవాలని కల కంటారు. అంతటి ప్రతిష్టాత్మకమైన ఆస్కార్స్ మళ్లీ వచ్చేసింది. ఆస్కార్స్ 2026 ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతోంది. 98వ అకాడమీ అవార్డుల విన్నర్స్ ఎవరూ అనేది ఉత్కంఠగా మారింది.
ఆస్కార్స్ 2026
ప్రపంచ సినిమాకు పట్టం కట్టే ఆస్కార్స్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం సోమవారం (మార్చి 16) తెల్లవారుజామున లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో 98 వ అకాడమీ అవార్డుల కార్యక్రమం ప్రారంభమైంది. సినిమాకు సంబంధించిన వివిధ క్రాఫ్టల్లో సత్తాచాటిన వాళ్లకు అవార్డులు అందజేస్తున్నారు.
ఆస్కార్స్ విన్నర్స్
ఆస్కార్స్ 2026 ఈవెంట్లో ఇప్పటివరకూ కొంతమంది విజేతలను ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తమ సహాయ నటుడు: షాన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
ఉత్తమ సహాయ నటి : అమీ మాడిగన్ (వెపన్స్)
ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ : మైక్ హిల్, జోర్డాన్, క్లియోనా (ఫ్రాంక్ స్టీన్)
ఉత్తమ క్యాస్టూమ్ : డిజూన్ కేట్ హాలే (ఫ్రాంక్ స్టీన్)
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ : ది గర్ల్ వూ క్రైడ్ పర్ల్స్
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ : కె పాప్ డిమాన్ హంటర్స్
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ : ది సింగర్స్, టూ పీపుల్ ఎక్స్ చేంజింగ్ సలైవా
24 విభాగాల్లో
ఆస్కార్స్ ను ప్రతి ఏడాది 23 విభాగాల్లో ప్రకటించేవాళ్లు. కానీ ఈ సారి 24 విభాగాల్లో అందిస్తున్నారు. కొత్తగా బెస్ట్ కాస్టింగ్ అనే విభాగాన్ని ప్రవేశపెట్టారు. 2025 సంవత్సరంలో రిలీజైన సినిమాలకు ఈ పురస్కారాలు అందజేస్తున్నారు.
బెస్ట్ యాక్టర్ ఎవరు?
సినిమా రంగంలోనే అత్యున్నతమైన ఆస్కార్ ను అందుకోవాని ప్రతి హీరో కోరుకుంటాడు. మరి ఈ సారి బెస్ట్ యాక్టర్ గా నిలిచేది ఎవరు? అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. బెస్ట్ యాక్టర్ అవార్డు కోసం నామినేషన్లు ఇలా ఉన్నాయి
తిమోతీ చలామెట్ - మార్టి సుప్రీం
లియోనార్డో డికాప్రియో - వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అదర్
ఏతాన్ హాక్ - బ్లూ మూన్
మైఖేల్ బి జోర్డాన్ - సిన్నర్స్
వాగ్నర్ మౌరా - ది సీక్రెట్ ఏజెంట్
ఉత్తమ నటి నామినేషన్లు
జెస్సీ బక్లీ - హామ్నెట్
రోజ్ బైర్న్ - ఇఫ్ ఐ హావ్ లెగ్స్ ఐ హాడ్ కిక్ యు
కేట్ హడ్సన్ - సాంగ్ బ్లూ
రెనేట్ రీన్స్వ్ - సెంటిమెంటల్ వాల్యూ
ఎమ్మా స్టోన్ - బుగోనియా
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper












