Oscars OTT: ఆస్కార్స్ ఈవెంట్.. ఇండియాలో స్ట్రీమింగ్ ఎప్పుడు? ఈ ఓటీటీలోనే!

Oscars OTT: ప్రతిష్ఠాత్మక ఆస్కార్స్ ఈవెంట్ కు సమయం దగ్గరపడుతోంది. ఈ సారి అకాడమీ అవార్డుల ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది? ఇండియాలో ఏ టైమ్ కి, ఏ ఓటీటీలో చూడాలో ఓ లుక్కేయండి. 

Published on: Mar 3, 2026, 10:15:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రపంచ సినిమాకు పట్టం కట్టే ఈవెంట్ మరోసారి రాబోతుంది. జీవితంలో ఒక్కసారైనా ఈ అవార్డును అందుకోవాలని మూవీ ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్కరూ కల కంటారు. అదే ఆస్కార్స్. ఆస్కార్స్ 2026 ఈవెంట్ కు రంగం సిద్ధమవుతోంది. మరి ఈ అకాడమీ అవార్డుల ప్రోగ్రామ్ ను ఇండియాలో ఎప్పుడు? ఎక్కడ? లైవ్ చూడాలో తెలుసుకోండి.

ఆస్కార్ అవార్డుల ఈవెంట్ ఓటీటీ
ఆస్కార్ అవార్డుల ఈవెంట్ ఓటీటీ

ఆస్కార్స్ 2026

ఆస్కార్స్ 2026 ఈవెంట్ కు సమయం దగ్గరపడుతోంది. ఈ మెగా ప్రోగ్రాం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఉన్న హాలీవుడ్ డాల్బీ థియేటర్లో జరుగుతుంది. అమెరికా టైమ్ ప్రకారం ఈ 98వ అకాడమీ అవార్డులు మార్చి 15, 2026న విజేతలకు అందిస్తారు. 2025లో రిలీజైన సినిమాలకు గాను డిఫరెంట్ విభాగాల్లో ఈ పురస్కారాలు ఇవ్వనున్నారు.

టైమ్ ఇదే

అమెరికా టైమ్ ప్రకారం ఆస్కార్స్ 2026 ఈవెంట్ మార్చి 15న రాత్రి 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ దేశాల్లో, ప్రాంతాల్లో ఈ ఈవెంట్ ను లైవ్ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. యునైటెడ్ స్టేట్స్‌లోని వ్యూయర్స్ ఈ ఈవెంట్ ను ఏబీసీ నెట్ వర్క్ లో చూడొచ్చు. ఆన్ లైన్ లోనేమో హులు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇండియాలో ఇలా

98వ అకాడమీ అవార్డుల ఈవెంట్ ను ఇండియాలోని ఆడియన్స్ కూడా చూడొచ్చు. భారత కాలమానం ప్రకారం ఈ ఈవెంట్ మార్చి 16, 2026న స్ట్రీమింగ్ అవుతుంది. ఉదయం 4.30 గంటల నుంచి ఇండియాలో ఈ ఈవెంట్ ను చూడొచ్చు. స్టార్ మూవీస్, స్టార్ మూవీస్ సెలెక్ట్, కలర్స్ ఇన్ఫినిటీ ఛానెల్స్ లో ఈ ఈవెంట్ ప్రీమియర్ అవుతుంది. ఓటీటీ విషయానికి వస్తే జియోహాట్ స్టార్ లో ఆస్కార్స్ ఈవెంట్ స్ట్రీమింగ్ కానుంది.

హోస్ట్ అతనే

ఆస్కార్స్ 2026కు పాపులర్ కమెడియన్ ఓ బ్రియన్ హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. 2025లోనూ ఈ ఈవెంట్ కు అతనే యాంకర్ గా వ్యవహరించాడు. ఈ సారి కూడా అతనే హోస్ట్ గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఆస్కార్స్ కన్ఫామ్ చేసింది. వరుసగా రెండో ఏడాది కూడా అకాడమీ అవార్డుల ఈవెంట్ ను హోస్ట్ చేసిన అతి కొద్ది మందిలో ఓ బ్రియన్ ఒకడిగా నిలవబోతున్నాడు.

ఆస్కార్స్ 2026 ఈవెంట్ కు జేవియర్ బార్డెమ్, క్రిస్ ​​ఎవాన్స్, డెమి మూర్, కుమైల్ నంజియాని, మాయా రుడాల్ఫ్ లాంటి స్టార్లు ప్రజెంటర్లుగా వ్యవహరించనున్నారు. మరి ఈ ఈవెంట్లో ఏ సినిమా అదరగొడుతుందో? ఎవరు బెస్ట్ హీరోగా నిలుస్తారో చూడాలి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More