రకుల్ ప్రీత్ సింగ్‌కు షాకింగ్ అనుభవం.. అవార్డు తీసుకుని షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అవమానం.. వీడియో వైరల్
టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓ ప్రైవేట్ అవార్డుల ఫంక్షన్లో రకుల్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్న ఓ ఫిట్నెస్ ఇన్ ఫ్లూయెన్సర్ తీరు వైరల్ గా మారింది. కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా అతను వెళ్లడంతో రకుల్ కు అవమానం ఎదురైందనే కామెంట్లు వస్తున్నాయి.
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓ అవార్డుల ఫంక్షన్లో అవమానం కలిగింది. రకుల్ ప్రీత్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఫిట్నెస్ ఇన్ ఫ్లూయెన్సర్ లక్షయ్ జగ్గి ప్రవర్తించిన తీరు వైరల్ గా మారింది. అవార్డు తీసుకున్న తర్వాత అతను.. రకుల్ ను పట్టించుకోకుండా వెళ్లిపోయాడు.

రకుల్ ప్రీత్ కు అవమానం
రకుల్ ప్రీత్ సింగ్ కు అవమానం ఎదురైంది. తాజాగా ఆమె ఓ ప్రైవేట్ అవార్డుల ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా వెళ్లింది. అక్కడ కొంతమందికి అవార్డులు అందించింది. ఫిట్నెస్ ఇన్ ఫ్లూయెన్సర్ లక్షయ్ జగ్గి కూడా రకుల్ ప్రీత్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాడు. కానీ అవార్డు తీసుకున్న తర్వాత రకుల్ ను పట్టించుకోకుండా వెళ్లిపోయాడు.
రకుల్ షాక్
అవార్డు తీసుకున్నాక లక్షయ్ జగ్గి నేరుగా వెళ్లిపోయాడు. కనీసం రకుల్ ప్రీత్ సింగ్ ముఖం కూడా చూడలేదు. ఫొటోలకు పోజు ఇవ్వలేదు. షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఒక చిరునవ్వు కూడా నవ్వలేదు. కనీసం మాట్లాడలేదు. లక్షయ్ అలా వెళ్లిపోతుంటే రకుల్ ప్రీత్ చాలా అసౌకర్యంగా ఫీల్ అయింది. ఆమె ముఖంలో అది స్పష్టంగా కనిపించింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
యాటిట్యూడ్ ఎందుకు బ్రో?
రకుల్ ప్రీత్ సింగ్ నుంచి అవార్డు తీసుకున్న తర్వాత లక్షయ్ జగ్గి బిహేవియర్ పై ట్రోల్స్ వస్తున్నాయి. అంత యాటిట్యూట్ ఎందుకు బ్రో? అని నెటిజన్లు కామెంట్లలో ప్రశ్నిస్తున్నారు. కనీసం అవార్డుకైనా విలువ ఇవ్వాలి కదా అని అడుగుతున్నారు.
లక్షయ్ రియాక్షన్
అయితే అవార్డు తీసుకున్న తర్వాత తన బిహేవియర్ గురించి లక్షయ్ రియాక్టయ్యాడు. ఇదే అవార్డుల ఫంక్షన్లో తన కంటే ముందు ఓ మహిళా.. రకుల్ ప్రీత్ సింగ్ నుంచి అవార్డు అందుకుంది. అయితే ఆమెకు రకుల్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించిందని లక్షయ్ చెప్పాడు.
‘‘నాకంటే ముందు ఒక మహిళా అవార్డు తీసుకోవడానికి వచ్చింది. అప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కు ఆమె షేక్ హ్యాండ్ ఇవ్వాలని అనుకుంది. కానీ అందుకు రకుల్ నిరాకరించింది. నేను కూడా రకుల్ కు షేక్ హ్యాండ్ ఇవ్వాలనుకుంటే, అప్పుడూ ఆమె నో చెప్తే ఏంటీ పరిస్థితి? నేనెందుకు అడిగి మరీ బాధపడాలి. అందునే నా అవార్డును తీసుకుని నేరుగా వెళ్లిపోయా’’ అని లక్షయ్ పేర్కొంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


