డెబ్యూ విన్న‌ర్స్‌కు మాట్లాడే ఛాన్స్ ఇవ్వ‌రా? ఫిల్మ్‌ఫేర్ అవార్డు ఆర్గ‌నైజ‌ర్స్‌పై నిహారిక కొణిదెల ఫైర్‌.. ఏమైందంటే?

మెగా డాటర్ నిహారిక కొణిదెలకు కోపమొచ్చింది. ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సౌత్ 2026 ఈవెంట్ ఆర్గనైజర్స్ పై ఆమె మండిపడింది. డెబ్యూ అవార్డులు గెలిచిన వాళ్లకు ఛాన్స్ ఇవ్వకపోవడం ఏంటి అని సోషల్ మీడియాలో ప్రశ్నించింది. 

Published on: Feb 22, 2026, 18:03:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిహారిక కొణిదెల సంచలన పోస్టు పెట్టింది. ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సౌత్ 2026 ఈవెంట్ ఆర్గనైజర్లపై మండిపడింది. డెబ్యూ విన్నర్స్ కు స్టేజీపై మాట్లాడే ఛాన్స్ ఇవ్వరా? అని ప్రశ్నించింది. ఒక్క నిమిషం దొరకలేదా? అని అడిగింది. ఈ పోస్టు వైరల్ గా మారింది.

నిహారిక కొణిదెల
నిహారిక కొణిదెల

ఫిల్మ్‌ఫేర్ అవార్డులు

ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సౌత్ 2026 ఈవెంట్ కేరళలోని కొచ్చిలో ఘనంగా జరిగింది. కానీ ఈ ఈవెంట్ జరిగిన తీరు పట్ల నిహారిక కొణిదెల నిరాశ వ్యక్తం చేసింది. తన మనసులోని మాటను నిర్మొహమాటంగా పంచుకుంది. ఆదివారం (ఫిబ్రవరి 22) ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు పెట్టింది.

అద్భుతంగా ఉన్నా

ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సౌత్ 2026 ఈవెంట్ లో డెబ్యూ అవార్డులు గెలిచిన వాళ్లకు స్టేజీపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై నిహారిక ఫైర్ అయింది.

‘‘ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో ఇండియన్ సినిమా టాలెంట్ ను గుర్తించడం ఎప్పుడూ ప్రత్యేకమే. అద్భుతమైన ప్రతిభను ఒకే చోట చూడటం నిజంగా ఎంతో స్పెషల్ గా అనిపించింది’’ అని నిహారిక తన పోస్టులో రాసుకొచ్చింది.

కల నెరవేరినట్లు

‘‘తెలుగు, తమిళ, కన్నడ సినిమా రంగాల్లోంచి డెబ్యూ అవార్డులు అందుకున్న వారికి స్టేజీపై మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఇది ఒక మంచి అవకాశాన్ని కోల్పోవడమే అని నేను అనుకుంటున్నా. డెబ్యూ అవార్డులు గెలిచిన వాళ్లు ఇప్పుడే తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఈ స్టేజ్ వీళ్లకు ఒక పర్ఫార్మెన్స్ స్టేజీ మాత్రమే కాదు. అవార్డు అందుకోవడమంటే వాళ్ల కల నెరవేరినట్లు’’ అని నిహారిక కొణిదెల పేర్కొంది.

ఒక్క నిమిషం

‘‘వాళ్ల మాటలు వింటే సినిమాలపై ఎందుకు ప్రేమ పెంచుకున్నామో అందరికీ గుర్తుకు వచ్చేది. ఇంత భారీ ఈవెంట్లో సమయ పరిమితులు తప్పనిసరి అని నాకు తెలుసు. కానీ మొదటి సారి వేదికపై నిలబడ్డ వాళ్లకు ఒక్క నిమిషం ఇస్తే బాగుండేది. ఇప్పుడు ఆ నిమిషమే తన లైఫ్ టైమ్ ను కోల్పోయింది’’ అని నిహారిక తన పోస్టులో పేర్కొంది.

ఈ అవార్డులు

నిహారిక కొణిదెల నటిగా తన జర్నీ కొనసాగిస్తూనే ప్రొడ్యూసర్ గానూ అదరగొడుతోంది. ఆమె నిర్మాతగా వచ్చిన కమిటీ కుర్రోళ్లు సినిమా హిట్ గా నిలిచింది. ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా కమిటీ కుర్రోళ్లు సినిమా డైరెక్టర్ యధు వంశీ, బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా కమిటీ కుర్రోళ్లు నటుడు సందీప్ సరోజ్ పురస్కారాలు అందుకున్నారు. వీళ్లకు ఆ స్టేజీపై మాట్లాడే ఛాన్స్ రాలేదు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More