అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ.. అవార్డు విన్నింగ్ డైరెక్టర్ సినిమా
ఓటీటీలోకి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ తెలుగు సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ సినిమా పేరు హనీ. భిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న నవీన్ చంద్ర, అవార్డు విన్నింగ్ డైరెక్టర్ కరుణ్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది.
ఓటీటీలో హారర్ థ్రిల్లర్ జానర్ లవర్స్ కు ఓ గుడ్ న్యూస్. ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్ పైకి హనీ అనే ఓ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ నెల 6న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. మూడు వారాల్లోనే డిజిటల్ ప్రీమియర్ కానుంది. తెలుగుతోపాటు తమిళంలోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు సన్ నెక్ట్స్ ఓటీటీ వెల్లడించింది.

హనీ ఓటీటీ రిలీజ్ డేట్
నవీన్ చంద్ర, బిగ్ బాస్ ఫేమ్ దివి, దివ్య పిళ్లై, రాజా రవీంద్రలాంటి వాళ్లు నటించిన హారర్ థ్రిల్లర్ హనీ (Honey). ఈ సినిమాను ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సన్ నెక్ట్స్ ఓటీటీ శుక్రవారం (ఫిబ్రవరి 20) వెల్లడించింది. నిజానికి ముందే ఈ వార్త బయటకు వచ్చినా.. తాజాగా ఆ ఓటీటీ అధికారికంగా అనౌన్స్ చేసింది. “కొన్ని భయాలు ఎప్పటికీ వదలి వెళ్లవు.. అవి ఫాలో అవుతుంటాయి.. తమిళం, తెలుగులో ఫిబ్రవరి 27 నుంచి కేవలం సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్.. మిస్ కావద్దు” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.
హనీ మూవీ స్టోరీ, విశేషాలు
పలాస మూవీతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అవార్డు విన్నింగ్ డైరెక్టర్ కరుణ కుమార్ ఈ హనీ సినిమాను డైరెక్ట్ చేశాడు. సామాజిక స్పృహ ఉన్న అతని నుంచి అలాంటిదే మరో మూవీ ఈ హనీ రూపంలో వచ్చింది. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన మూవీ ఇది. భయపెట్టే ఆత్మలు కాదు, భయపెట్టే మనుషులే ఈ కథకు కేంద్ర బిందువు అని, మూఢనమ్మకాలు మనిషిని ఎంత దూరం తీసుకెళ్తాయి అనే ప్రశ్న ఆడియెన్స్‌ను భయపెడుతుందని మేకర్స్ చెబుతూ వచ్చారు.
ఈ సినిమాలో ఆనంద్ అనే పాత్రలో నవీన్ చంద్ర నటించాడు. అతడు మూఢనమ్మకాలు, క్షుద్ర పూజలను బాగా నమ్ముతాడు. ఆ నమ్మకాల కారణంగానే ఉద్యోగం పోతుంది. ఆనంద్ భార్య లలిత (దివ్య పిళ్లై), కూతురు మీరా.. ఇద్దరూ అతని భయంకరమైన ఆలోచనల మధ్య నలిగిపోతుంటారు.
ఈ క్రమంలోనే ఆనంద్ తన కుటుంబాన్ని ఊరికి దూరంగా ఉన్న ఓ ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ తన పూజలు ఫలిస్తాయని, మీరా తన మాట వింటే అన్నీ బాగుపడతాయని చెబుతాడు. మొదట ఎదిరించిన లలిత కూడా ఆ తర్వాత పరిస్థితుల ముందు తలవంచుతుంది.
ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆనంద్ మీరాతో ఏం చేయించాడు? అతని మూఢనమ్మకాలకు నిజంగానే ఫలితం దక్కిందా? ఆ ఇంట్లో తల్లి-కూతుళ్లు ఎదుర్కొన్న భయానక అనుభవాలు ఏంటీ? పిల్లి మాయ ఏంటీ? చీకటి మనుషుల కథ ఏంటీ? అనేది తెలియాలంటే ఈ హనీని చూడాల్సిందే. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వాళ్లు ఫిబ్రవరి 27 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో చూడొచ్చు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


