టీఎంసీ విశాఖలో పలు పోస్టులకు నోటిఫికేషన్.. కేవలం ఇంటర్వ్యూతోనే ఉద్యోగం
హొమి బాబా క్యాన్సర్ హాస్పిటల్ విశాఖపట్నంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. అర్హత గల అభ్యర్థులు ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగం పొందవచ్చు.
టీఎంసీ విశాఖపట్నంలో పలు విభాగాల్లో ఖాళీలకు నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఈ ఉద్యోగాలు ఒప్పంద ప్రాతిపదికన అని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. పోస్టులు ఆధారంగా శాలరీ ఉంటుంది. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగం పొందవచ్చు.

టాటా మెమోరియల్ హాస్పిటల్‌లో ఇన్ఛార్జ్, టీచర్ (ప్రీ-ప్రైమరీ / ప్రైమరీ), టీచర్ (సెకండరీ) పోస్టులకు 17.12.2025న ఉదయం 09:30 నుండి 10:30 వరకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు.
ఇన్ఛార్జ్ పోస్టుకు గ్రాడ్యుయేషన్ లేదా చైల్డ్ కేర్ / నర్సింగ్‌లో డిప్లొమా లేదా సంబంధిత అర్హత ఉండాలి. ఇందులో ఒక పోస్ట్ ఉంది. చైల్డ్ కేర్ సెక్టార్ లేదా ఇలాంటి రకమైన సెటప్‌లో 02 ఏళ్ల అనుభవం ఉండాలి. జీతం రూ.30,000 ఇస్తారు.
టీచర్ (ప్రీ-ప్రైమరీ / ప్రైమరీ) పోస్టుకు ECCEdలో డిప్లొమాతో HSC అర్హత ఉండాలి. 1 పోస్ట్ ఉంది. ఒక ఏడాది అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. బోధనా అనుభవం, పిల్లల సంరక్షణ, వారిని ఉత్పాదక కార్యకలాపాలలో నిమగ్నం చేయడంలో అనుభవం కావాలి. జీతం రూ. 23,220గా ఉంది.
టీచర్ (సెకండరీ) ఒక పోస్ట్ ఉంది. దీనికి ECCEdలో డిప్లొమాతో గ్రాడ్యుయేట్ ఉండాలి. ఏడాది అనుభవం ఉండాలి. రూ. 25,510 జీతం ఉంటుంది.
అర్హత కలిగిన అభ్యర్థులు H.R.D. డిపార్ట్‌మెంట్, అవుట్‌సోర్సింగ్ సెల్, 4వ అంతస్తు, సర్వీస్ బ్లాక్ బిల్డింగ్, టాటా మెమోరియల్ హాస్పిటల్, డాక్టర్ ఈ.బోర్గెస్ రోడ్, పరేల్, ముంబై - 400012 వద్ద ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. అభ్యర్థులు తమ అప్డేట్ చేసిన రెజ్యూమ్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలు, పాన్ కార్డ్, విద్యా సర్టిఫికెట్లు, అనుభవ సర్టిఫికెట్‌లను తీసుకెళ్లాలి. ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే.. పరీక్ష నిర్వహిస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూ కోసం షార్ట్‌లిస్ట్ చేస్తారు.
మెుబైల్ డెవలపర్
టీఎంసీ విశాఖలో మెుబైల్ డెవలపర్ పోస్ట్ ఖాళీగా ఉంది. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 19వ తేదీన ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు. మెుబైల్ డెవలపర్ ఒక పోస్ట్ ఉంది. పోస్టు ఆధారంగా సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయో పరిమితి 30 ఏళ్లుగా నిర్ణయించారు. జీతం రూ.45000గా ఉంది. ఈ పోస్టు కాంట్రాక్ట్ లెక్కన తీసుకుంటారు. చేరిన తేదీ నుండి ఆరు నెలల నిర్ణీత కాలం వరకు ఉంటుంది. అవసరాన్ని బట్టి పొడిగిస్తారు. పైన పేర్కొన్న పోస్టుల సంఖ్య కేంద్రం అవసరాన్ని బట్టి పెరిగే/తగ్గే అవకాశం ఉంది.
ఇంటర్వ్యూ సమయంలో అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీల (విద్య, అనుభవం/రిలీవింగ్ & గత 3 నెలల పేస్లిప్) సెట్‌ను తీసుకురావడం తప్పనిసరి. ఇది లేకుండా అభ్యర్థి ఇంటర్వ్యూకు హాజరు కావడానికి అనుమతించరు. అలాగే అవసరమైతే అభ్యర్థి ఇంటర్వ్యూకు ముందు లేదా తర్వాత ఏవైనా అదనపు ఉపాధి రుజువు పత్రాలను అందించడానికి సిద్ధంగా ఉండాలి.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు బయో-డేటా, ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్, పాన్ కార్డ్ ఫోటో కాపీ, ఒరిజినల్ సర్టిఫికెట్లు, అన్ని సర్టిఫికెట్ల కాపీల సెట్‌తో విశాఖపట్నంలోని HRD డిపార్ట్‌మెంట్ మొదటి అంతస్తులోని హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్‌లో హాజరు కావచ్చు. ఇంటర్వ్యూ డిసెంబర్ 19వ తేదీన ఉంటుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


