...
...
Next Story

రాజమహేంద్రవరం 4వ బెటాలియన్‌, ఏపీఎస్పీలో ఉద్యోగాలు.. దరఖాస్తులు ఇలా

రాజమహేంద్రవరం APSP 4వ బెటాలియన్‌లో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు.

Published on: Aug 27, 2026, 11:57:11 IST
By , Rajamahendravaram
Prefer HTon Google
Advertisement

ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ పరిధిలోని రాజమహేంద్రవరం 4వ (IR) బెటాలియన్, APSPలో ఖాళీగా ఉన్న వివిధ రకాల అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్, 4వ బెటాలియన్ కమాండెంట్ పి. సత్తిబాబు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.

రాజమహేంద్రవరంలో ఉద్యోగాలు
రాజమహేంద్రవరంలో ఉద్యోగాలు

మొత్తంగా వివిధ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు నెలకు రూ. 15,000 వేతనంగా చెల్లిస్తారు. రికార్డు అసిస్టెంట్ (Record Assistant)01, ఆఫీస్ సబోర్డినేట్ 1, స్వీపర్లు 9, దోబీలు 5, బార్బర్లు 4, కుక్స్ 14, స్కావెంజర్స్ 03 పోస్టులు ఉన్నాయి.

పోస్టును బట్టి విద్యార్హతలు ఉంటాయి. 7వ తరగతి చదవడం, రాయడం, సంబంధిత వృత్తి నైపుణ్యం ఉండాలి. 01.07.2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల మినహాయింపు ఉంటుంది(గరిష్ట వయస్సు 47 సంవత్సరాలు).

రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్లు ఏపీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమలు చేస్తారు. రాతపరీక్ష ఉంటుంది. మొత్తం 100 మార్కులకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫారమ్‌ను తూర్పు గోదావరి జిల్లా అధికారిక వెబ్‌సైట్ https://eastgodavari.ap.gov.in/ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రారంభ తేదీ 27-08-2026 ఉదయం 10:00 గంటల నుండి చివరి తేదీ: 05-09-2026 సాయంత్రం 5:00 గంటలలోపు చేయాలి.

దరఖాస్తు పంపవలసిన చిరునామా:కమాండెంట్,4వ IR బెటాలియన్, APSP,(42వ బెటాలియన్ CRPF పక్కన), ఏ.వి. అప్పారావు రోడ్, లాలాచెరువు, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా - 533106.

ఈ నియామకాలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అభ్యర్థులను మాత్రమే లోకల్ అభ్యర్థులుగా పరిగణిస్తారు. దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, పనిచేస్తున్న మొబైల్ నంబర్/ఈమెయిల్ తప్పనిసరి. ఎంపికైన ఉద్యోగులు బెటాలియన్ అవసరాల నిమిత్తం రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లడానికి సిద్ధంగా ఉండాలి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe