AP MPP ZP chairperson Elections : ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తదనంతర ఘట్టానికి రాష్ట్ర ఎన్నికల సంఘం వేదిక సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 659 మండల ప్రజా పరిషత్‌లు, 28 జిల్లా ప్రజా పరిషత్‌ల పరిధిలో అధ్యక్ష, ఉపాధ్యక్ష, ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ నోటిఫికేషన్లు జారీ చేశారు.

ఇటీవల నవంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ నిర్వహించగా… తుఫాన్ ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి, ఏలూరు జిల్లాలో నాలుగు మండలాల్లో నవంబర్ 6న వాయిదా పడిన పోలింగ్ పూర్తి చేశారు. కొన్ని చోట్ల ఫిర్యాదుల ఆధారంగా 7 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరిపి…. నవంబర్ 7న ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలు వెల్లడించారు.
తాజా నోటిఫికేషన్ ప్రకారం….. మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు నవంబర్ 19న, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ పదవులకు నవంబర్ 20న పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ మేరకు ప్రిసైడింగ్ అధికారులు ఆయా తేదీల్లో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తారు.
కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక విధానం…
ముందుగా ప్రతి ఎంపీపీలో ఒకరిని, ప్రతి జెడ్పీపీలో ఇద్దరిని కో-ఆప్టెడ్ సభ్యులుగా ఎన్నుకుంటారు. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాతే ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, జెడ్పీపీ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన జీవో ఎంఎస్ నెం. 131 (తేదీ: 11.03.1995) ప్రకారం.. మతపరమైన మైనారిటీలు (ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు) లేదా తెలుగు మాతృభాష కాని భాషాపరమైన మైనారిటీలకు చెందిన వారు ఈ కో-ఆప్టెడ్ సభ్యులుగా ఉండేందుకు అర్హులు.
ఈ పరోక్ష ఎన్నికలను సభ్యులు 'చేతులు పైకెత్తే' పద్ధతిలో నిర్వహిస్తారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు జారీ చేసే విప్‌ను ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అయితే కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నికకు విప్ వర్తించదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
{{/usCountry}}ఈ పరోక్ష ఎన్నికలను సభ్యులు 'చేతులు పైకెత్తే' పద్ధతిలో నిర్వహిస్తారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు జారీ చేసే విప్‌ను ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అయితే కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నికకు విప్ వర్తించదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
{{/usCountry}}సమావేశాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్-అఫీషియో సభ్యులుగా హాజరయ్యే అవకాశం ఉన్నప్పటికీ, వారికి ఓటు వేసే హక్కు ఉండదు. ఎన్నికల్లో పాల్గొనే సభ్యులకు నవంబర్ 14లోగా నోటీసులు అందజేస్తారు. ఎన్నికల ప్రక్రియ సుఫీణంగా పూర్తి చేసేందుకు ఎస్‌ఈసీ విస్తృత మార్గదర్శకాలను జారీ చేసింది.