...
...
Next Story

చికెన్ దుకాణాలకు లైసెన్స్.. ఎక్కడ తెస్తున్నారు? ఎవరికి అమ్ముతున్నారు? ట్రాక్ చేసే సిస్టమ్!

ఏపీలో చికెన్ షాపులకు కొత్త రూల్స్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. లైసెన్సింగ్ విధానాన్ని తీసుకురావాలని రాష్ట్ర మంసాభివృద్ధి సంస్థ నిర్ణయం తీసుకుంది.

Published on: Oct 16, 2025, 10:14:17 IST
Advertisement

ఇకపై చికెన్ షాపుల్లో కొత్త విధానాలు రానున్నాయి. ఈ మేరకు చికెన్ దుకాణాల యజమానులు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. చికెన్ బిజినెస్‌లో అక్రమాలను అరికట్టడానికి ఏపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇకపై ప్రతీ విషయం రికార్డ్ కానుంది. పశు సంవర్ధకశాఖ డైరెక్టర్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. సంస్థ ఛైర్మన్‌ చంద్ర దండు ప్రకాష్‌నాయుడు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో డైరెక్టర్లు ప్రవీణ, అజ్ముద్దీన్, పశు సంవర్ధక శాఖ సంచాలకులు దామోదర్‌నాయుడు, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.

చికెన్ షాపులకు లైసెన్స్
చికెన్ షాపులకు లైసెన్స్

చికెన్ దుకాణాలకు లైసెన్సింగ్ విధానాన్ని తీసుకోచ్చేందుకు రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ నిర్ణయం తీసుకున్నది. దీని ప్రకారం కచ్చితంగా ప్రతీ దుకాణానికి లైసెన్స్ తప్పనిసరి. అంతేకాదు.. ఏ ఫారం నుంచి కోళ్లు వచ్చాయో.. దుకాణదారుడు వాటిని ఎవరికి అమ్మారో అనే అంశాలు కూడా రికార్డు కానున్నాయి. అన్ని అంశాలు ట్రాక్ చేసేలా ఒక సిస్టమ్‌ను తీసుకురానుంది ప్రభుత్వం.

ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మున్సిపాలిటీల్లో మాంసం దుకాణాలపై ఆకస్మిక దాడులు చేపట్టి, అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. చికెన్, మటన్ దుకాణాలను క్రమబద్ధీకరించడం చేయాలి. అంతేకాదు గుర్తింపు పొందిన చికెన్ షాపుల నుంచి హోటళ్ల నిర్వాహకులు మాంసం కొనేలా ప్రోత్సహించాలి. ఇంజెక్షన్స్ వాడిన కోళ్లను అమ్మడాన్ని పూర్తిగా నియంత్రించాలని రాష్ట్ర మంసాభివృద్ధి సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

చికెన్ దుకాణాల నుంచి వ్యర్థాలు ఏ రేంజ్‌లో వస్తాయో అందరికీ తెలిసిందే. వీటి ద్వారా ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. అయితే దుకాణాల వ్యర్థాలను ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో డిస్పోజ్ చేసేలా ప్రణాళిక చేస్తుంది ప్రభుత్వం. చికెన్ దుకాణాల నుంచి వ్యర్థాలను తీసుకెళ్లి చేపలకు ఆహారంగా వాడుతున్నవారిపై చర్యలు తీసుకోనుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks