...
...
Next Story

SCR Special Trains : విశాఖ-సికింద్రాబాద్ మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్స్... టైమింగ్స్, హాల్టింగ్ వివరాలివే!

పండుగ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే వన్ వే స్పెషల్ రైళ్లను ప్రకటించింది. విశాఖపట్నం-సికింద్రాబాద్, మైసూర్-విజిఎల్ ఝాన్సీ మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.

Published on: Oct 20, 2026, 21:07:20 IST
Advertisement

పండుగ సీజన్‌లో సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) ఊరట కలిగించే వార్త అందించింది. పండుగ రోజుల్లో ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నియంత్రించటంతో పాటు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు వన్ వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది.

వన్ వే స్పెషల్ ట్రైన్
వన్ వే స్పెషల్ ట్రైన్

దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం….. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు, అలాగే మైసూర్ నుంచి వీజీఎల్ ఝాన్సీ జంక్షన్‌కు ఈ ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నారు.

విశాఖపట్నం – సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్ ( నెంబర్ 08515) :

ఈ ప్రత్యేక రైలు (01 సర్వీసు) 2026 అక్టోబర్ 21న విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది. మధ్యాహ్నం 15:50 గంటలకు (3:50 PM) విశాఖపట్నంలో ప్రారంభమై, మరుసటి రోజు ఉదయం 07:05 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన కేంద్రాలను అనుసంధానిస్తూ ఈ రైలుకు హాల్టింగ్‌లు ఇచ్చారు. దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ మరియు చర్లపల్లి స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.

ఈ రైలులో ఏసీ 2-టైర్, ఏసీ 3-టైర్, స్లీపర్ క్లాస్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు.

మైసూర్ – వీజీఎల్ ఝాన్సీ జంక్షన్ స్పెషల్ ట్రైన్ (నెంబర్- 06275):

ఈ వన్ వే ప్రత్యేక రైలు (01 సర్వీసు) కూడా 2026 అక్టోబర్ 21న మైసూర్ నుంచి బయలుదేరుతుంది. సాయంత్రం 17:05 గంటలకు (5:05 PM) మైసూర్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10:00 గంటలకు వీజీఎల్ ఝాన్సీ జంక్షన్ చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైలులో కేవలం స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. పండుగ వేళ సాధారణ రైళ్లలో బెర్త్‌లు లభించక ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు ఈ వన్ వే ప్రత్యేక రైళ్లు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయి. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks