...
...
Next Story

AP KGBV Admissions : కేజీబీవీ అడ్మిషన్స్ 2026 కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభం.. ఈ లింక్ క్లిక్ చేసి అప్లై చేయండి!

AP Kasturba Gandhi Balika Vidyalayas Admissions 2026 : ఏపీలోని కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో ప్రవేశాలకు అప్లికేషన్ మెుదలైంది. ఏప్రిల్ 1వ తేదీ వరకు అప్లై చేయవచ్చు.

Updated on: Mar 12, 2026, 18:21:54 IST
Advertisement

KGBV Admissions 2026 : 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో(KGBV) 6, 11 తరగతుల ప్రవేశాలకు, అలాగే 7, 8, 9, 10, 12 తరగతులలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి మార్చి 12 నుండి 2026 ఏప్రిల్ 1 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

అనాథలు, బడి మానేసిన పిల్లలు, డ్రాపౌట్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీపీఎల్ కుటుంబాలకు చెందిన బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాసరావు తెలిపారు. దరఖాస్తు ఫారాలు apkgbv.apcfss.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని, ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులను మాత్రమే అడ్మిషన్ల కోసం పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎంపికైన బాలికలకు ఫోన్ ద్వారా సందేశాలు అందుతాయని చెప్పారు. పేర్లు సంబంధిత పాఠశాలల నోటీసు బోర్డులలో కూడా ప్రదర్శించనున్నట్టుగా వెల్లడించారు.

మరిన్ని వివరాలకు విద్యార్థులు, తల్లిదండ్రులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య 7993329115, 7075039990 ఫోన్ నంబర్లకు సంప్రదించవచ్చు.

నోటిఫికేషన్‌లో భాగంగా ఆరో తరగతితో పాటు ఇంటర్‌ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లు కల్పిస్తారు. అంతేకాకుండా 7 నుంచి పదో తరగతి వరకు ఖాళీ ఉన్న సీట్ల భర్తీకి ఏప్రిల్‌ 1 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆరో తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థి 5వ తరగతిలో తప్పనిసరిగా ఉత్తీర్ణుడై ఉండాలి. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ సీటు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి.. టెన్త్ పాసై ఉండాలి. ప్రస్తుతం టెన్త్ ఎగ్జామ్స్ రాసే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ లింక్ క్లిక్ చేసి అప్లికేషన్ చేసుకోండి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe