TG DEECET 2026 : టీజీ డీఈఈసెట్ నోటిఫికేషన్ విడుదల - ముఖ్యమైన వివరాలు
TG DEECET Notification 2026 : టీజీ డీఈఈసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఎల్‌ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్(డీపీఎస్‌ఈ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఎల్‌ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్(డీపీఎస్‌ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ డీఈఈసెట్ - 2026 నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

మార్చి 5 నుంచి దరఖాస్తులు…
టీజీ డీఈఈసెట్ - 2026 ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 15వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. మే 21, 22 తేదీల్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 450 చెల్లించాలి. ఇక జనరల్ అభ్యర్థులకు రూ. 500గా నిర్ణయించారు. htpps://deecet.cdse.telangana.gov.in వెబ్‌సైట్ లో వివరాలను తెలుసుకోవచ్చు.
టీజీ డీఈఈసెట్ నోటిఫికేషన్ కు సంబంధించి ఏమైనా సందేహాలుంటే 8317567404 నెంబర్ ను సంప్రదించవచ్చు. పూర్తిస్థాయి నోటిఫికేషన్ వివరాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయి.
టీజీ డీఈఈసెట్ రాసే అభ్యర్థులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రమే సీట్లు కేటాయిస్తారు. ఫలితాల ప్రక్రియ తర్వాత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తారు. విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. విడత వారీగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా ఈ ప్రాసెస్ పూర్తవుతుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

