AP Pattadar Passbooks : రాష్ట్రంలో భూవివాదాలకు శాశ్వతంగా చరమగీతం పాడటమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే రాబోయే మార్చి 2027 నాటికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 73 లక్షల పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు, భూ యజమానులకు పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. నంద్యాల జిల్లా బనగానపల్లె గ్రామంలో గురువారం జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు.
వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్….
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నాటి ప్రభుత్వం తమకు నచ్చని ప్రజల భూములను ప్రభుత్వ భూముల జాబితా అయిన 22-A లో చేర్చిందని ఆయన ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే వివాదాలు సృష్టించి… ఆయా భూములను లాక్కోవడానికే ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. చివరికి వఖ్ఫ్ బోర్డుకు చెందిన దాదాపు 2,100 ఎకరాల భూములను కూడా ఈ నిషిద్ధ జాబితాలోకి నెట్టేశారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. అయితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలబడాలనే సంకల్పంతో 22-A జాబితాలో అక్రమంగా చేర్చిన భూములను తొలగించిందని ఆయన వివరించారు.
"మార్చి 2027 నాటికి 72.7 లక్షల పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలని స్పష్టమైన లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆంధ్రప్రదేశ్‌ను భూవివాదాలు లేని ప్రశాంత రాష్ట్రంగా మార్చడమే మా కూటమి ప్రభుత్వ ఏకైక ధ్యేయం" అని సీఎం స్పష్టం చేశారు.
ప్రజల భూములను లాక్కోవడానికి, వారిలో భయాందోళనలు సృష్టించడానికి గత ప్రభుత్వం 'ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్' అనే ఒక నల్ల చట్టాన్ని తీసుకువచ్చిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతోనే తాము అధికారంలోకి రాగానే ఆ నల్ల చట్టాన్ని పూర్తిగా రద్దు చేశామని గుర్తు చేశారు.
రాయలసీమ ప్రాంత భవిష్యత్తును పారిశ్రామికంగా పూర్తిగా మార్చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కడప స్టీల్ ప్లాంట్, హీరో మోటోకార్ప్ పరిశ్రమలతో పాటు ప్రతిష్టాత్మక అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ప్రాజెక్టు లాంటి భారీ పరిశ్రమలు ఈ ప్రాంతంలో అడుగుపెడుతున్నాయని చెప్పారు. ఇవన్నీ రాయలసీమ రూపురేఖలను మార్చబోతున్నాయని వివరించారు.
{{/usCountry}}రాయలసీమ ప్రాంత భవిష్యత్తును పారిశ్రామికంగా పూర్తిగా మార్చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కడప స్టీల్ ప్లాంట్, హీరో మోటోకార్ప్ పరిశ్రమలతో పాటు ప్రతిష్టాత్మక అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ప్రాజెక్టు లాంటి భారీ పరిశ్రమలు ఈ ప్రాంతంలో అడుగుపెడుతున్నాయని చెప్పారు. ఇవన్నీ రాయలసీమ రూపురేఖలను మార్చబోతున్నాయని వివరించారు.
{{/usCountry}}పారిశ్రామిక రంగంతో పాటు రాయలసీమను దేశంలోనే ఒక పెద్ద హార్టికల్చర్ (ఉద్యానవన) హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు సీఎం ప్రకటించారు. ఇందుకోసం ప్రభుత్వ పరంగా 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, ప్రైవేటు రంగం ద్వారా మరో 60,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంటూ…. ఈ ప్రాంతంలోని లింగాల గ్రామంలో ఉన్న తలసరి ఆదాయం దేశంలోని కొన్ని ప్రధాన నగరాలు, పట్టణాల కంటే కూడా చాలా ఎక్కువగా ఉందని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
రావణ్ కేసుపై సీఎం రియాక్షన్….
యూట్యూబర్ బచలకురి జోసెఫ్ ఉదంతాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. హిందూ దేవుళ్లయిన శ్రీరాముడు, సీతాదేవిపై జోసెఫ్ అత్యంత అసభ్యకరమైన పోస్టులను అప్‌లోడ్ చేశాడని, అలాగే ఉగ్రవాదానికి, పాకిస్తాన్‌కు మద్దతుగా మాట్లాడాడని చంద్రబాబు ఆరోపించారు. 'ప్రశ్న రావణ్ ' పేరుతో సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన జోసెఫ్‌ను, ఏడు నెలల క్రితం అతడు చేసిన వివాదాస్పద వీడియో ఆధారంగా ఇటీవలే చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
జోసెఫ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా సహాయం అందించిందని చంద్రబాబు సంచలన ఆరోపణ చేశారు. కులం, మతం, ప్రాంతాల పేరుతో సమాజంలో చీలికలు తెచ్చేందుకు ప్రతిపక్ష పార్టీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. "రావణుడిని ప్రోత్సహించే వాళ్లు కూడా బయటకు వచ్చి హే రామ్ అంటూ జపం చేయడం చూస్తుంటే నాకేం మాట్లాడాలో అర్థం కావడం లేదు," అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు.