...
...
Next Story

పాపికొండలు విహారయాత్ర పునఃప్రారంభం.. 20 రోజుల బ్రేక్ తర్వాత మళ్లీ స్టార్ట్!

పాపికొండలు విహారయాత్ర మళ్లీ ప్రారంభమైంది. 20 రోజుల బ్రేక్ తర్వాత అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇకపై పర్యాటకులు టూర్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు.

Updated on: Jul 4, 2026, 16:41:26 IST
Advertisement

గోదావరి నదిపై పర్యాటక బోటు ప్రయాణాల కోసం ఎదురుచూస్తున్న పర్యాటకులకు లైన్ క్లియర్ అయింది. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గండిపోశమ్మ ఫెర్రీ పాయింట్ నుండి ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పాపికొండల వరకు శనివారం నుండి పర్యాటక బోటు సర్వీసులు ప్రారంభమయ్యాయి. భద్రతా తనిఖీలు (సేఫ్టీ ఆడిట్) విజయవంతంగా పూర్తి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

పాపికొండలు టూర్ ప్రారంభం
పాపికొండలు టూర్ ప్రారంభం

గత నెల జూన్ 14వ తేదీన భద్రతా కారణాలు, సాంకేతిక లోపాలను ఉటంకిస్తూ జిల్లా యంత్రాంగం పాపికొండల రూట్‌లో నడిచే పర్యాటక బోట్లను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. బోటు ఆపరేటర్లు అందరూ కచ్చితంగా సమగ్ర భద్రతా తనిఖీలు చేయించుకోవాలని, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు పొందాలని అధికారులు అప్పట్లో ఆదేశించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా ఉండేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బోటు నిర్వాహకులు తమ పడవలకు సంబంధించిన అన్ని రకాల భద్రతా ప్రమాణాలను పూర్తి చేశారు. లైఫ్ జాకెట్లు, అగ్నిమాపక పరికరాలు, బోటు కండిషన్ వంటి కీలక అంశాలను అధికారులు నిశితంగా పరిశీలించారు. ఈ సేఫ్టీ ఆడిట్ ప్రక్రియ విజయవంతంగా ముగియడంతో, పర్యాటకుల భద్రతపై పూర్తి స్పష్టత వచ్చిన తర్వాతే బోట్ల పునరుద్ధరణకు పచ్చజెండా ఊపారు.

గండిపోశమ్మ ఘాట్ వద్ద ఉదయం నుంచే బోటు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. పాపికొండల విహారయాత్రకు వెళ్లాలనుకునే పర్యాటకులు అధికారిక కౌంటర్లు లేదా గుర్తింపు పొందిన ఆపరేటర్ల ద్వారానే టిక్కెట్లు బుక్ చేసుకోవాలి. ప్రయాణ సమయంలో ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా లైఫ్ జాకెట్ ధరించాలి. సిబ్బంది సూచనలను పాటించాలి.

గోదావరి నది అందాలను, పాపికొండల ప్రకృతి దృశ్యాలను వీక్షించేందుకు వచ్చే పర్యాటకుల రద్దీ మళ్లీ పెరగనుంది. బోటు సర్వీసులు పునఃప్రారంభం కావడంతో అటు పర్యాటక రంగానికి, ఇటు స్థానిక వ్యాపారులకు ఊరట లభించింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe