ప్రయాణికులకు అలర్ట్ - ఏపీ నుంచి పుదుచ్చేరి వెళ్లే పలు రైళ్లు రద్దు, పూర్తి వివరాలు

ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే కీలక అలర్ట్ ఇచ్చింది.  నిర్వహణ కారణాలతో పుదుచ్చేరి మార్గంలో నడిచే పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. 

Published on: Jul 5, 2026, 06:02:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో ప్రయాణించే పలు కీలక రైళ్ల సర్వీసుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. నిర్వహణ కారణాల వల్ల పుదుచ్చేరి మార్గంలో నడిచే ఐదు రైళ్లను పాక్షికంగా రద్దు లేదా ముందస్తుగా నిలిపివేస్తున్నట్లు (షార్ట్ టెర్మినేషన్) రైల్వే అధికారులు ప్రకటించారు. జూలై నెలలో వివిధ తేదీల్లో ఈ మార్పులు అమలులో ఉంటాయి.

పుదుచ్చేరి వెళ్లే పలు రైళ్లు పాక్షికంగా రద్దు
పుదుచ్చేరి వెళ్లే పలు రైళ్లు పాక్షికంగా రద్దు

దక్షిణ కోస్తా రైల్వే వెల్లడించిన వివరాల ప్రకారం….. కాకినాడ, తిరుపతి, న్యూఢిల్లీ నుంచి పుదుచ్చేరి వెళ్లే రైళ్లతో పాటు హౌరా ఎక్స్‌ప్రెస్ సర్వీసులపై ఈ ప్రభావం పడనుంది. ఆయా రైళ్ల పూర్తి వివరాలు, తేదీలు ఇలా ఉన్నాయి.

మార్పులు చేసిన రైళ్ల వివరాలు:

  • కాకినాడ - పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ - 17655) : జూలై 11, జూలై 13 తేదీల్లో ప్రయాణించాల్సిన ఈ రైలును చెంగల్పట్టు వద్దే నిలిపివేస్తారు. చెంగల్పట్టు - పుదుచ్చేరి మధ్య ఈ రైలు సర్వీసును పాక్షికంగా రద్దు చేశారు.
  • తిరుపతి - పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ - 16111) : జూలై 12 నుంచి 15 వరకు, అలాగే జూలై 17, 18 తేదీల్లో నడిచే ఈ రైలు ముండియంపాక్కం వరకు మాత్రమే నడుస్తుంది. ముండియంపాక్కం - పుదుచ్చేరి మధ్య సర్వీస్ అందుబాటులో ఉండదు.
  • తిరుపతి - పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ - 16111) : జూలై 4, 8, 25, 29 తేదీల్లో ఈ రైలును విల్లుపురం వద్దే ముందస్తుగా నిలిపివేస్తారు. విల్లుపురం - పుదుచ్చేరి మధ్య ఈ రైలును పాక్షికంగా రద్దు చేశారు.
  • పుదుచ్చేరి - హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ - 12868) : జూలై 15న నడవాల్సిన ఈ రైలు పుదుచ్చేరికి బదులుగా విల్లుపురం స్టేషన్ నుంచే తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. పుదుచ్చేరి - విల్లుపురం మధ్య ఈ సర్వీసును రద్దు చేశారు.
  • న్యూఢిల్లీ - పుదుచ్చేరి వీక్లీ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ - 22404) : జూలై 12న ప్రయాణించాల్సిన ఈ వీక్లీ రైలు పుదుచ్చేరి వరకు వెళ్లకుండా విల్లుపురం వద్దే ఆగిపోతుంది. విల్లుపురం - పుదుచ్చేరి మధ్య ఈ రైలు సర్వీసును పాక్షికంగా నిలిపివేశారు.

ఈ తేదీల్లో ప్రయాణం పెట్టుకునే వారు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు, స్టేషన్‌కు బయలుదేరే ముందే రైళ్ల తాజా రన్నింగ్ స్టేటస్‌ను ఒకసారి సరిచూసుకోవాలని అధికారులు సూచించారు. మార్పులను గమనించి… ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని పేర్కొన్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More