...
...
Next Story

Pawan Kalyan Divorce : పవన్ కళ్యాణ్ విడాకులు.. చంద్రబాబు, వైఎస్ జగన్ స్ట్రాంగ్ వార్నింగ్!

Pawan Kalyan Divorce : పవన్ కళ్యాణ్-అన్నా కొణిదెల విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై టీడీపీ, వైసీపీ అధిష్ఠానాలు తమ క్యాడర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాయి.

Updated on: Nov 10, 2026, 22:28:40 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నా కొణిదెల తమ వైవాహిక బంధాన్ని పరస్పర అంగీకారంతో ముగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు బాధ్యతాయుతమైన నిర్ణయాన్ని తీసుకున్నాయి. పవన్ కళ్యాణ్ విడాకుల అంశం పూర్తిగా ఆయన వ్యక్తిగత విషయమని, దీనిపై పార్టీ నాయకులు, కార్యకర్తలు లేదా మద్దతుదారులు ఎలాంటి అనుచిత పోస్టులు, విమర్శలు లేదా వ్యాఖ్యలు చేయకూడదని వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీ తమ శ్రేణులను హెచ్చరించాయి.

వ్యక్తిగత విమర్శలకు తావులేదు: ఐటీడీపీ

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్

తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగం ఐటీడీపీ(iTDP) ఈ వ్యవహారంపై ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. పొత్తు ధర్మంలోని భాగస్వామ్య పక్షాల నాయకులైనా లేదా ప్రత్యర్థి వైఎస్సార్‌సీపీ నేతలైనా సరే, ఎవరి వ్యక్తిగత జీవితాలను ఉద్దేశించి సోషల్ మీడియాలో అనుచితమైన వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం తగదని స్పష్టం చేసింది. ఐటీడీపీ ప్రతినిధులు లేదా పార్టీకి అనుబంధంగా ఉన్న ఖాతాల ద్వారా వ్యక్తిగత విమర్శలు చేసే వారిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని నిష్కర్షగా పేర్కొంది. సోషల్ మీడియాలో ఎవరైనా స్వతంత్రంగా చేసే వ్యక్తిగత విమర్శలు లేదా అనుచిత వ్యాఖ్యలతో తమ సంస్థకు ఎలాంటి సంబంధం ఉండదని వివరణ ఇచ్చింది.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ దిశానిర్దేశం

గతంలో రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిగత అంశాలపై జరిగిన విమర్శలు, వాటి వల్ల ఎదురైన ప్రతికూల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్‌సీపీ ఈసారి అప్రమత్తమైంది. ప్రజా సమస్యలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పాలనాపరమైన విధానాలపై మాత్రమే రాజకీయ పోరాటం జరగాలని, ఎవరి వ్యక్తిగత జీవితాలను విమర్శనాత్మక రాజకీయాలకు వాడుకోకూడదని పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఒక నాయకుడి వ్యక్తిగత జీవితాన్ని విమర్శించడం సరైన పద్ధతి కాదని, ప్రతి ఒక్కరి వ్యక్తిగత గోప్యతను గౌరవించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని స్పష్టం చేశారు.

రాజకీయ రంగంలో ప్రత్యర్థుల వ్యక్తిగత విషయాలను విమర్శలకు వాడుకోవడం వల్ల రాజకీయ వాతావరణం దెబ్బతింటుందనే భావన చాలాకాలంగా ఉంది. పవన్ కళ్యాణ్ విడాకుల ఘటనలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రాజకీయ విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాయకుల వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజా సమస్యలు, పాలనాపరమైన అంశాలకే విమర్శలను పరిమితం చేసే ఈ సంప్రదాయం మున్ముందు కూడా కొనసాగితే రాష్ట్ర రాజకీయాల్లో ఆరోగ్యకరమైన మార్పు వస్తుందని అభిప్రాయపడుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks