...
...
Next Story

అభివృద్ధిలో ఏపీ దూసుకెళ్తోంది, చంద్రబాబు, పవన్ రూపంలో శక్తివంతమైన నాయకత్వం దొరికింది - ప్రధాని మోదీ

కర్నూలులో నిర్వహించిన సూపర్ జీఎస్టీ - సూపర్‌ సేవింగ్స్‌ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత ప్రధాని మోదీ మాట్లాడుతూ…అభివృద్ధి కోసం అమరావతి, ఢిల్లీ కలిసి పని చేస్తున్నాయన్నారు. కేంద్రం నుంచి అన్ని రకాలుగా సాకారం అందిస్తున్నామని చెప్పారు.

Published on: Oct 16, 2025 04:22 PM IST
Advertisement

కర్నూలులోని నన్నూరులో తలపెట్టిన సూపర్ జీఎస్టీ - సూపర్‌ సేవింగ్స్‌ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. రూ.13,429 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత ప్రధాని మోదీ ప్రసగించారు. “సోదర, సోదరిమణులకు నమస్కారాలు” అంటూ తెలుగులో ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ పర్యటనలో శ్రీశైలం, అహోబిలం, మంత్రాలయం ఆశీస్సులు పొందానని చెప్పారు.

కర్నూల్ సభలో ప్రధాని మోదీ
కర్నూల్ సభలో ప్రధాని మోదీ

“అహోబిలం నరసింహస్వామి, మహానందీశ్వరుడికి నమస్కారాలు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండోదైన శ్రీశైలం మల్లిఖార్జునుడిని దర్శించుకున్నాను. ఆ తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించాను” అని ప్రధాని మోదీ తెలిపారు.

శక్తివంతమైన నాయకత్వం ఉంది - ప్రధాని మోదీ

చంద్రబాబు, పవన్ కల్యాణ్ రూపంలో ఏపీకి శక్తివంతమైన నాయకత్వం దొరికింది. అభివృద్ధి కోసం అమరావతి, ఢిల్లీ కలిసి పని చేస్తున్నాయి. కేంద్రం నుంచి అన్ని రకాలుగా సాకారం అందిస్తున్నాం. ఆత్మగౌరవం, సంస్కృతికి ఏపీ నిలయం వంటింది. 16 నెలల్లో అభివృద్ధి డబుల్ ఇంజిన్ మాదిరిలా దూసుకెళ్తోంది” అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిధిలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

“2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యం. ఈ 21 శతాబ్ధం భారత్‌దే. రోడ్లు, రైల్వేలతో సహా అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసుకుంటున్నాం. కాంగ్రెస్‌ పాలనలో కరెంట్‌ కోతలు ఉండేవి. కనీసం కొన్ని గ్రామాల్లో కరెంట్‌ పోల్స్‌ కూడా ఉండేవి కావు. ఇప్పుడు దేశంలో కరెంట్‌ లేని గ్రామం లేదు” అని ప్రధాని మోదీ ప్రకటించారు.

"దేశంలో ఇందన విప్లవానికి ఏపీ కేరాఫ్. రెండు రోజుల కిందటే గూగుల్ కంపెనీ ఏపీలో అతిపెద్ద పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. కొత్త ఏఐ హబ్ లో శక్తివంతమైన డేటా సెంటర్లు ఉండనున్నాయి. గూగుల్ ఏఐ హబ్ పెట్టుబడితో విశాఖపట్నం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. తీర ప్రాంతానికి మరింత కనెక్టివిటీ పెరగనుంది. సీఎం చంద్రబాబు విజన్ ను ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నాను. ఏపీ అభివృద్ధికి కర్నూల్ అభివృద్ధి కూడా చాలా అవసరం. ఇవాళ తలపెట్టిన ప్రాజెక్టులతో ఇక్కడ అభివృద్ధి మరింత వేగవంతమవుతంది. ప్రతి జిల్లాలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి" అని ప్రధాని మోదీ వివరించారు.

రాష్ట్ర సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… మోదీ లాంటి గొప్ప వ్యక్తి తన జీవితంలో చూడలేదన్నారు. రాబోయే శతాబ్ధాలకు ప్రధాని మోదీ పునాది వేశారని కొనియాడారు. అన్ని వర్గాలకు లబ్ధి కలిగించేలా సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబానికి మేలు జరుగుతోందని చెప్పారు. సూపర్ జీఎస్టీతో సూపర్ సేవింగ్స్ ఉంటాయన్నారు. జీఎస్టీలో కొత్త సంస్కరణలు తీసుకొచ్చినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నామని సీఎం చంద్రబాబు ప్రసంగించారు.

రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… ప్రధాని మోదీ ఒక కర్మయోగి అన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్నారు కాబట్టే మోడీని కర్మయోగి అంటామని చెప్పారు. జీఎస్టీ సంస్కరణలు చేపట్టి సామాన్యులకు రిలీఫ్‌ కల్పించారని తెలిపారు. ఆత్మనిర్భర భారత్ దిశగా ముందుకెళ్తున్నామన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు పాలిస్తుందని… ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకొని నిలబడతామని వ్యాఖ్యానించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe