భారతదేశ సాంప్రదాయ చేతిపనులు, ముఖ్యంగా నరసాపురం లేస్ క్రాఫ్ట్ ఆర్థిక వృద్ధిని, సామాజిక సాధికారతను ఎలా నడిపిస్తున్నాయో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. మన్‌కీ బాత్‌లో భాగంగా నరసాపురం లేస్ ఉత్పత్తుల గురించి ప్రస్తావించారు. లేస్ క్రాఫ్ట్‌ను "సహనం, సంక్లిష్టమైన కళాత్మకతకు చిహ్నం"గా ప్రశంసించారు.

తరతరాలుగా మహిళా చేతివృత్తులవారు అంకితభావంతో లేస్ ఉత్పత్తుల వారసత్వాన్ని నిలబెట్టుకున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ రంగాన్ని ఆధునీకరించడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నాబార్డ్ మద్దతుతో నైపుణ్య శిక్షణను అందిస్తోందన్నారు. నరసాపురం లేస్ ఉత్పత్తులు కొత్త డిజైన్లను పరిచయం చేస్తోందన్నారు. మార్కెట్ సంబంధాలను మెరుగుపరుస్తోందని పేర్కొన్నారు.
నరసాపురం లేస్ పరిశ్రమ గణనీయమైన మైలురాళ్లను సాధించిందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. వాటిలో భౌగోళిక సూచిక (GI) ట్యాగ్‌ను పొందడం కూడా ఉందన్నారు. ఇది దాని బ్రాండ్ గుర్తింపు, మార్కెట్ విలువను పెంచిందన్నారు. ఈ రంగం ఇప్పుడు 250కి పైగా గ్రామాల్లో దాదాపు లక్ష మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. 500కి పైగా రకాల లేస్ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తుంది.
ప్రధానమంత్రి ఈ లేస్ ఉత్పత్తుల పరిశ్రమను బలంతో కొమ్మలుగా పెరుగుతున్న చెట్టుతో పోల్చారు. ఆధునిక అవకాశాలతో సాంప్రదాయ నైపుణ్యాలకు మద్దతు ఇవ్వడం వల్ల దేశవ్యాప్తంగా గ్రామీణ వర్గాలకు స్థిరమైన జీవనోపాధిని సృష్టించవచ్చని చెప్పారు.
ఈ లేస్ కళ తరతరలుగా మహిళల చేతుల్లో ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశంలోని మహిళలు దీనిని ఓర్పుతో, శ్రద్ధతో పరిరక్షించారని కొనియాడారు. నేడు ఈ కళలు కొత్త కోణంలో ముందుకు తీసుకెళ్లబడుతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నాబార్డ్ సంయుక్తంగా కళాకారులకు కొత్త డిజైన్లను నేర్పిస్తూ.. మెరుగైన నైపుణ్య శిక్షణ అందిస్తూ.. కొత్త మార్కెట్లతో అనుసంధానం చేస్తున్నాయన్నారు.
నరసాపురం లేస్ ఉత్పత్తులకు 200 ఏళ్ల చరిత్ర ఉంది. స్వీడన్ మిషనరీల సంస్థలు ఇక్కడ లేస్ అల్లికలను పరిచయం చేశారు. ఆ తర్వాత రానురాను దుస్తుల డిజైన్లను ఉపయోగించే లేస్ అల్లికలు.. త్వరగానే పెద్ద పరిశ్రమగా మారింది. వివిధ దేశాలలో నరసాపురం లేస్‌ను ఉపయోగిస్తారు. 1930 ప్రాంతంలో లండన్ విధుల్లో నరసాపురం లేస్ ఉత్పత్తుల అమ్మకాలు జరిగేవన్నారు.
{{/usCountry}}నరసాపురం లేస్ ఉత్పత్తులకు 200 ఏళ్ల చరిత్ర ఉంది. స్వీడన్ మిషనరీల సంస్థలు ఇక్కడ లేస్ అల్లికలను పరిచయం చేశారు. ఆ తర్వాత రానురాను దుస్తుల డిజైన్లను ఉపయోగించే లేస్ అల్లికలు.. త్వరగానే పెద్ద పరిశ్రమగా మారింది. వివిధ దేశాలలో నరసాపురం లేస్‌ను ఉపయోగిస్తారు. 1930 ప్రాంతంలో లండన్ విధుల్లో నరసాపురం లేస్ ఉత్పత్తుల అమ్మకాలు జరిగేవన్నారు.
{{/usCountry}}2000లో నరసాపురం లేస్ పార్కును ఏర్పాటు చేశారు. అంబేద్కర్ హస్త వికాస్ యోజన కింద.. ఈ అరుదైన హస్తకళను సంరక్షించేందుకు, ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. దీనితో డీఆర్డీఏతో ఉపయోగించుకుని.. భారతదేశంలో మెుట్టమెుదటి లేస్ పార్క్‌ను నరసాపురంలో అభివృద్ధి చేసింది. లేస్ పార్క్ ఏర్పాటుతో అనేక మార్పులు వచ్చాయి.