మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ - గుంటూరులో హైటెన్షన్

గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం చంద్రబాబుపై అసభ్యకరమైన వ్యాఖ్యలను ఖండిస్తూ.. టీడీపీ శ్రేణులు అంబటి రాంబాబు ఇంటి వద్ద శనివారం ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.

Published on: Feb 1, 2026, 07:21:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో మాజీ మంత్రి అంబటి రాంబాబును శనివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని భారీ భద్రత మధ్య నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు…. అంబటి వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ శ్రేణులు ఆయన ఇంటిని ముట్టడించాయి.

వైసీపీ నేత అంబటి అరెస్ట్
వైసీపీ నేత అంబటి అరెస్ట్

ఈ క్రమంలో నిరసనకారులు ఇంటిపై రాళ్లు రువ్వి, కారు మరియు అద్దాలను ధ్వంసం చేశారు. అంతటితో శాంతించని ఆందోళనకారులు… … ఇంటికి నిప్పు పెట్టారు. ఆపై కారుకి కూడా నిప్పు పెట్టగా… వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యాయి. మంటలను ఆర్పేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

అంబటి రాంబాబు తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. అంబటికి వ్యతిరేకంగా భారీ ఎత్తున నినాదాలు చేశారు. పెరిగిన ఉద్రిక్తతల మధ్య… శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి పోలీసులు భారీగా రంగంలోకి దిగారు. మొత్తంగా గుంటూరులోని అంబటి ఇంటి సమీపంలో హైటెన్షన్ వాతావరణమే నెలకొంది.

చంద్రబాబును దూషించిన కేసులో టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా 126(2),196,352,351 (2),292 రెడ్‌ విత్‌ 3(5) BNS సెక్షన్ల కింద అంబటిపై కేసు నమోదైంది. అంతేకాకుండా విధులకు ఆటంకం కల్గించారని నల్లపాడు ఎస్సై కృష్ణమోహన్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అంబటిపై 126(2),132 BNS సెక్షన్ల కింద మరో కేసులు నమోదు చేశారు.

వైసీపీ నేతలు సీరియస్…

అంబటి ఇంటిపై జరిగిన దాడిని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆ పార్టీ అధినేత వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి… మాజీ మంత్రి అంబటి రాంబాబుతో ఫోన్ లో మాట్లాడారు. రాంబాబు భద్రత గురించి అడిగి తెలుసుకున్నారు. దాడిని తీవ్రంగా ఖండించారు. అడుగడుగునా పార్టీ తరపున పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తామని హామీనిచ్చారు.

“అంబటి ఇంటిపై టీడీపీ గూండాలు, కార్యకర్తలు దాడి చేసి, ఇల్లు ధ్వంసం చేశారు. ఆయనపై, ఆయన కుటుంబ సభ్యులపై హత్యాయత్నం చేశారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ ప్రభుత్వం నడుస్తోంది అని మరోసారి రుజువైంది. తెలుగుదేశం పార్టీని, కూటమి నాయకులకు హెచ్చరిస్తున్నాం మా ప్రభుత్వం రాగానే, కర్మ తిరిగి వస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ రుచిచూపిస్తాం” అని వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More