...
...
Next Story

తాడిపత్రి బాలుడి హత్యకేసు.. సీన్ రీ కన్‌స్ట్రక్షన్.. నిందితుడిపై పోలీసుల కాల్పులు!

అనంతపురం జిల్లా తాడిపత్రి బాలుడి హత్య కేసులో నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్ సమయంలో నిందితుడు పారిపోతుండగా ఈ ఘటన జరిగింది.

Published on: Mar 27, 2026, 10:14:10 IST
Advertisement

తాడిపత్రి నియోజకవర్గం యాడికి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడి కిడ్నాప్ ఆ తర్వాత హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. నిందితుడు పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసుల కాల్పులు చేసినట్టుగా తెలుస్తోంది.

తాడిపత్రి బాలుడి హత్యకేసు నిందితుడిపై పోలీసుల కాల్పులు
తాడిపత్రి బాలుడి హత్యకేసు నిందితుడిపై పోలీసుల కాల్పులు

కోనఉప్పలపాడులో ఏడేళ్ల బావమరిది వేంచంద్రను బావ సర్వేశ్‌కుమార్‌ కిడ్నాప్ చేశాడు. కుందనకోట గ్రామం వద్ద బాలుడిని గొంతు నులిమి, రాయితో కొట్టి కిరాతకంగా హత్య చేశాడు నిందితుడు. అయితే సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం ఘటనాస్థలానికి వెళ్లిన సమయంలో పోలీసులపై నిందితుడు తిరగబడి బీర్ బాటిల్‌తో దాడి చేశాడు. పోలీసులు ఎంత చెప్పినా వినలేదు. చెత్త కుప్ప పక్కన ఉన్న బీర్ బాటిల్ తీసుకొని.. పోలీసులపై దాడికి దిగాడు సర్వేశ్. వెంటనే పోలీసులు అప్రమత్తయ్యారు. ఆత్మరక్షణలో భాగంగా నిందితుడు సర్వేశ్ కుమార్.. మోకాళ్లపై సీఐ రామసుబ్బయ్య కాల్పులు జరిపారు. కాళ్ళకు బుల్లెట్లు తగిలి కింద పడి పోలీసులకు దొరికాడు నిందితుడు.

సీఐ రామసుబ్బయ్య, మరో కానిస్టేబుల్‌కు గాయాలు అయ్యాయి. సర్వేశ్‌ రెండు కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

అసలు ఏం జరిగిందంటే?

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం కోనకోనఉప్పలపాడులో వేంచేంద్ర అనే ఏడేళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు. బాలుడికి బావ అయ్యే వ్యక్తి మాయ మాటలు చెప్పి తీసుకెళ్లి.. కుందనకోటకొండలో చంపి పడేశాడు. వేంచేంద్ర అక్కను సర్వేశ్ వివాహం చేసుకున్నాడు.

బాలుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ టీవీ పుటేజ్ పరిశీలించారు. ఓ వ్యక్తి ముసుగు ధరించి.. బైక్ మీద రావడం, ఉప్పలపాడులోని ఒక షాపు దగ్గర తినుబండారాలు కొనుగోలు చేయడం కనిపించింది. బలుడి స్కూల్ బస్సు రావడం కూడా సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. సర్వేశ్ బాలుడిని తీసుకెళ్లి హత్య చేసినట్టుగా విచారణలో వెళ్లడైంది. ఇంట్లో గొడవలతో బాలుడిని సర్వేశ్ చంపేసినట్టుగా తెలుస్తోంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe