Dhurandhar 2: ధురంధర్ 2ను అడ్డుకునే కుట్ర? కెనడాలో థియేటర్ స్క్రీన్‌లు ధ్వంసం.. పోలీసుల ఎంట్రీతో టెన్షన్.. వీడియో వైరల్

Dhurandhar 2:కెనడాలో 'ధురంధర్ 2' సినిమా స్క్రీనింగ్ గందరగోళంగా మారింది. థియేటర్ స్క్రీన్‌లను కొందరు ధ్వంసం చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. సినిమాను అడ్డుకోవడానికి కుట్ర జరుగుతోందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. మూవీ వసూళ్లు మాత్రం రూ.300 కోట్లు దాటాయి.

Published on: Mar 21, 2026, 17:05:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ స్పై థ్రిల్లర్, ప్రపంచవ్యాప్తంగా థియేటర్లకు ప్రేక్షకులను క్యూ కట్టేలా చేస్తోంది. అయితే, కెనడాలోని మాంట్రియల్‌లో జరిగిన ఒక షాకింగ్ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.

ధురంధర్ 2 స్క్రీన్ లు ధ్వంసం
ధురంధర్ 2 స్క్రీన్ లు ధ్వంసం

థియేటర్ స్క్రీన్‌లు ధ్వంసం

కెనడాలోని మాంట్రియల్ లో ధురంధర్ 2 సినిమా ప్రదర్శన జరుగుతుండగానే కొందరు ఉన్మాదులు థియేటర్ స్క్రీన్‌ను ధ్వంసం చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం, మాంట్రియల్‌లోని సినీప్లెక్స్ అట్వాటర్, అంగ్రిగ్నాన్ థియేటర్లలో ఈ గందరగోళం నెలకొంది. సినిమా చూస్తున్న ప్రేక్షకుల మధ్య గొడవ జరగడంతో, ఒక వర్గం వారు ఏకంగా మెరుపు దాడి చేసి సినిమా స్క్రీన్‌ను చించేశారు.

రంగంలోకి పోలీసులు

పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. థియేటర్లకి వచ్చారు. తెరను చించేసిన వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనతో సినిమా చూడటానికి వచ్చిన సాధారణ ప్రేక్షకులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా రకరకాలుగా స్పందిస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

అడ్డుకోవడానికి కుట్ర జరుగుతోందా?

"ఎవరో కావాలనే ఈ సినిమాను అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారు. అందుకే నేను ఖచ్చితంగా ఈ సినిమా చూస్తాను" అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. మరికొందరు ఆస్తి నష్టాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఆ స్క్రీన్‌లు ఏమీ తక్కువ ధరకు రావు అని మండిపడుతున్నారు. ఎవరైనా సరే మరోసారి ఇలాంటి పనులు చేయొద్దనే విమర్శలు వస్తున్నాయి. సినిమాపై అసంతృప్తి ఉంటే మాటలతో చెప్పాలని కానీ ఇలా డ్యామేజీ కలిగించొద్దని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.

రికార్డు వసూళ్లు

ఓ వైపు వివాదాలు, అడ్డంకులు ఉన్నప్పటికీ 'ధురంధర్ 2' వసూళ్లలో మాత్రం దూసుకుపోతోంది. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటివరకు భారతదేశంలో రూ.278 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.300 కోట్ల మార్కును దాటేసి బాక్సాఫీస్ వద్ద తన ప్రభంజనాన్ని చాటుతోంది. ఈ సినిమా మార్చి 19న రిలీజైంది.

యాక్టింగ్ అదుర్స్

ధురంధర్ 2 సినిమాలో అందరి యాక్టింగ్ అదిరిపోయింది. ముఖ్యంగా రణ్‌వీర్ సింగ్ గూఢచారిగా మారే క్రమంలో ఇచ్చే శిక్షణ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేస్తున్నాయి. అర్జున్ రాంపాల్ ఏమో ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్‌గా, ఆర్.మాధవన్ ఏమో అజయ్ సన్యాల్‌గా తమ అద్భుతమైన నటనతో మెప్పిస్తున్నారు. సంజయ్ దత్, సారా అర్జున్, రాకేష్ బేడీ కూడా అదరగొట్టారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More