...
...
Next Story

Fertility Rate : ఆంధ్రప్రదేశ్‌లో ఫెర్టిలిటీ రేటులో అత్యధిక, అత్యల్ప శాతం ఉన్న జిల్లాలు ఏవి?

Fertility Rate In AP : రాష్ట్రంలో పాపులేషన్ మేనేజ్మెంట్ విధానం అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పాపులేషన్ మేనేజ్మెంట్‌పై చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.

Published on: Apr 22, 2026, 16:56:45 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో పాపులేషన్ మేనేజ్‌మెంట్ విధానం మీద సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. జిల్లాలవారీగా నివేదికలు పరిశీలించారు. జిల్లాల వారీగా ఫెర్టిలిటీ రేట్ వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. అత్యధికంగా కడపలో 1.99, అత్యల్పంగా విశాఖలో 1.32 శాతంగా టోటల్ ఫెర్టిలిటీ రేటు ఉంది.

పాపులేషన్ మేనేజ్మెంట్ విధానం
పాపులేషన్ మేనేజ్మెంట్ విధానం

ప్రస్తుతం రాష్ట్రంలో చూసుకుంటే.. 1.5 సగటుతో టోటల్ ఫెర్టిలిటీ రేటు నమోదు అయినట్టు అధికారులు వెల్లడించారు. ఈ లక్ష్యం 2.1కి పెంచడానికి తగిన కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో ప్రస్తుతం టోటల్ ఫెర్టిలిటీ రేటు సగటున 1.5 మాత్రమే ఉండటంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలంటే ఈ రేటు కనీసం 2.1 ఉండాలని ఆయన పేర్కొన్నారు. సంతానోత్పత్తి రేటు ఇలాగే తగ్గుతూ పోతే భవిష్యత్తులో ఏపీలో యువశక్తి కొరత ఏర్పడి, 'వృద్ధుల రాష్ట్రం'గా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా జనాభా నియంత్రణ కంటే ఆరోగ్యవంతమైన జనాభా పెరుగుదలే లక్ష్యంగా కొత్త 'పాపులేషన్ మేనేజ్‌మెంట్' పాలసీని తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పట్టణీకరణ, మారుతున్న జీవనశైలి వల్ల తగ్గుతున్న జనాభా రేటుపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. సంతానోత్పత్తి రేటును పెంచేలా దంపతులకు అవసరమైన ప్రోత్సాహకాలను అందించాలన్నారు. మెరుగైన మాతా శిశు ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయాలన్నారు.

మరోవైపు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) పద్ధతిలో వైద్య కళాశాలల ఏర్పాటును వేగవంతం చేయాలని, నెలలోగా ప్రాజెక్టులను సంబంధిత సంస్థలకు అప్పగించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు చెప్పారు. మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని ఫేజ్-1లో నాలుగు మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలన్నారు. అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురంలో ఫేజ్-2 ప్రాజెక్టులను కూడా నిర్ణీత గడువులోగా చేపట్టాలన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks