...
...
Next Story

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ - శ్రీ మలయప్ప స్వామివారి దివ్య దర్శనం!

తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ అత్యంత శోభాయమానంగా జరిగింది. మాడ వీధుల్లో గరుడ వాహనంపై విహరిస్తూ శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దివ్యభాగ్యాన్ని ప్రసాదించారు.

Published on: Sep 27, 2026, 07:40:08 IST
Advertisement

కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో శనివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా, నేత్రపర్వంగా జరిగింది. పౌర్ణమి తిథిని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం, రాత్రి 7 గంటలకు శ్రీ మలయప్ప స్వామివారు సర్వాలంకార భూషితుడై గరుడ వాహనంపై వేంచేశారు. తిరుమాడ వీధుల్లో అత్యంత శోభాయమానంగా జరిగిన ఈ ఊరేగింపులో స్వామివారు భక్తకోటికి దివ్య దర్శనమిచ్చి కటాక్షించారు. ఆలయ మాడ వీధులంతా గోవింద నామస్మరణలతో మారుమోగాయి.

గరుడ వాహన విశిష్ఠత…

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

హిందూ పౌరాణిక నేపథ్యంలో, ముఖ్యంగా 108 వైష్ణవ దివ్యదేశాలలో గరుడసేవకు అత్యంత ప్రాధాన్యత మరియు విశిష్ఠత ఉంది. భగవంతునికి, భక్తునికి మధ్య అనుసంధానకర్తగా ఉండే గరుడ వాహనం ద్వారా స్వామివారు తన దాసానుదాస ప్రపత్తికి తాను సర్వవేళలా దాసుడనని లోకానికి చాటిచెబుతారు.

జ్ఞానము, వైరాగ్యము అనే రెక్కలతో ఆకాశంలో విహరించే గరుడునిపై ఊరేగే శ్రీనివాసుని దర్శించుకోవడం వల్ల మానవులకు జ్ఞానవైరాగ్యాలు ప్రాప్తిస్తాయని అర్చకులు తెలిపారు. అంతేకాకుండా, పౌర్ణమి నాడు ఈ దివ్య వాహనసేవను కళ్లారా వీక్షించిన భక్తులకు సర్వపాపాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు.

ఈ పవిత్ర వాహనసేవ మహోత్సవంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామివార్లు పాల్గొని ఆధ్యాత్మిక శోభను ద్విగుణీకృతం చేశారు. వీరితో పాటు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ మరియు ఇతర ఆలయ ముఖ్య అధికారులు, విశేష సంఖ్యలో విచ్చేసిన భక్తులు పాల్గొన్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks