అత్యంత తీవ్రమైన తుపాను అర్నబ్ కారణంగా ఎన్టీఆర్ జిల్లాలో హెచ్చరిక జారీ చేశారు. దీని దృష్ట్యా విజయవాడ మున్సిపల్ అధికారులు నగరంలోని భారీ హోర్డింగ్‌లను తొలగించారు. అలాగే బుడమేరు వాగు పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను భారీ వర్ష సూచన దృష్ట్యా అప్రమత్తం చేస్తున్నారు.

భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, అక్టోబర్ 27, 28 తేదీల్లో జిల్లాలో అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎన్టీఆర్ జిల్లాలోని పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు. ప్రసిద్ధ కనకదుర్గ అమ్మవారి ఆలయం ఉన్న ఇంద్రకీలాద్రి వద్ద, భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 27 నుంచి తాత్కాలికంగా ఘాట్ రోడ్లను వాహనాల రాకపోకల కోసం మూసివేశారు. ఈ ప్రాంతంలో తరచుగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉంది; గత నెలలో కూడా ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది.
ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. సీనా నాయక్ మాట్లాడుతూ.. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను ఘాట్ రోడ్డు మార్గంలో అనుమతించబోమని తెలిపారు. భక్తులు కేవలం మహామండపం మార్గం ద్వారా మాత్రమే ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది.
తుపాను పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం మంగళవారం కలెక్టరేట్‌లో ఒక కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే 9154970454కి కాల్ చేయాలి. మరోవైపు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తుపాను ముప్పు ఉన్న ప్రాంతాల నుండి ప్రజలను తరలించేందుకు 30 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసింది.
బాపట్ల కంట్రోల్ రూమ్ నెంబర్లు
బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, తుపాను పరిస్థితులు, భారీ వర్షాలు, ఇతర అత్యవసర సమయాల్లో ప్రజలకు సహాయం అందించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేశారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు జిల్లా యంత్రాంగం 24 గంటల కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ప్రజలు జిల్లా కంట్రోల్ రూమ్‌ను 08643-220226 నంబర్ ద్వారా సంప్రదించవచ్చు. అలాగే 8712417880 అనే వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబర్‌కు తమ లొకేషన్ పంపడం ద్వారా కూడా సహాయం పొందవచ్చు.
{{/usCountry}}బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, తుపాను పరిస్థితులు, భారీ వర్షాలు, ఇతర అత్యవసర సమయాల్లో ప్రజలకు సహాయం అందించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేశారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు జిల్లా యంత్రాంగం 24 గంటల కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ప్రజలు జిల్లా కంట్రోల్ రూమ్‌ను 08643-220226 నంబర్ ద్వారా సంప్రదించవచ్చు. అలాగే 8712417880 అనే వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబర్‌కు తమ లొకేషన్ పంపడం ద్వారా కూడా సహాయం పొందవచ్చు.
{{/usCountry}}విద్యుత్ సరఫరాకు సంబంధించిన అత్యవసర పరిస్థితుల కోసం, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్(APCPDCL) వివిధ ప్రాంతాలకు ప్రత్యేక సంప్రదింపు నంబర్లను కేటాయించింది. బాపట్ల సర్కిల్ హెల్ప్‌లైన్ నంబర్ 9281413774 కాగా బాపట్ల, రేపల్లె డివిజన్ల కోసం 94910 52945, 94408 17597 నంబర్లను అందుబాటులో ఉంచారు.
అంతేకాకుండా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కార్యాలయాలకు సంబంధించిన హెల్ప్‌లైన్ నంబర్లను కూడా అధికారులు ప్రకటించారు. రేపల్లె ఆర్డీఓ కార్యాలయాన్ని 08648-293795 లేదా 94407 80426 నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు. చీరాల ఆర్డీఓ కార్యాలయానికి 8712655910 నంబర్, బాపట్ల ఆర్డీఐ కార్యాలయానికి 9493803524 నంబర్ కేటాయించారు.