అర్నబ్ తుపాను కారణంగా ఈ ట్రైన్ సర్వీసులు రద్దు.. రైళ్లు రీషెడ్యూల్
అర్నబ్ తుపాను ప్రభావం కారణంగా దక్షిణ మధ్య రైల్వేలోని పలు సర్వీసులు రద్దు చేసినట్టుగా అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
అర్నబ్ తుపానును దృష్టిలో ఉంచుకుని, ప్రయాణికుల భద్రత కోసం ముందుజాగ్రత్త చర్యగా దక్షిణ మధ్య రైల్వే 12 రైళ్లను రద్దు చేసింది. ఏపీ మీదుగా ఈ రైళ్లు వెళ్లనుండటంతో ప్రయాణికుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పూర్తిగా రద్దు చేసిన రైళ్ల వివరాలు చూస్తే..

12704 సికింద్రాబాద్–హౌరా
17016 సికింద్రాబాద్–భువనేశ్వర్
12728 హైదరాబాద్-విశాఖపట్నం
12862 మహబూబ్ నగర్-విశాఖపట్నం
12740 సికింద్రాబాద్-విశాఖపట్నం
12776 లింగంపల్లి-కాకినాడ పోర్ట్
12738 లింగంపల్లి-కాకినాడ పోర్ట్
20810 హెచ్ఎస్ నాందేడ్–సంబల్పూర్
07037 చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్
07038 శ్రీకాకుళం రోడ్-చర్లపల్లి
పైన పేర్కొన్న వాటితో పాటు నాగర్సోల్ నుండి నర్సాపూర్ వెళ్లే 12788 నంబర్ రైలు కూడా పాక్షికంగా రద్దు చేసినట్టుగా అధికారులు ప్రకటించారు. కోస్టల్ ఆంధ్రప్రదేశ్, ఒడిశాకు ప్రయాణించే ప్రయాణికులు అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్ నంబర్ల ద్వారా తమ రైలు సమయాలను తనిఖీ చేసుకోవాలని సూచించారు.
మరోవైపు ఏపీ పరిధిలో అక్టోబర్ 27, 28 తేదీల్లో వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించాల్సిన మొత్తం 53 రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ కోస్ట్ రైల్వే వెల్లడించింది. విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ పోర్టు, పార్వతీపురం, నరసాపురం, మచిలీపట్నం, భీమవరం, గుంటూరు, తెనాలి తదితర ప్రాంతాల మధ్య ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులపై తీవ్ర ప్రభావం పడనుంది.
ప్రయాణాలు చేయాలని భావిస్తున్న ప్రజలు ముందుగా తమ రైలు నంబర్, ప్రయాణ తేదీని సరిచూసుకోవాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు. రైల్వే స్టేషన్‌కు బయలుదేరే ముందే అధికారిక విచారణ కేంద్రాలు 139 హెల్ప్‌లైన్, నేషనల్ ట్రైన్ ఎన్‌క్వైరీ సిస్టమ్ (NTES) యాప్ ద్వారా రైళ్ల తాజా సమాచారాన్ని చూసుకోవాలి.
ఈ లింక్ క్లిక్ చేసి రద్దైన 53 రైళ్ల వివరాలు చూడండి.
రైళ్లు రీషెడ్యూల్
అర్నాబ్ తుపాను కారణంగా పలు రైళ్ల సమయాల్లో మార్పులు జరిగాయి. అక్టోబర్ 27, 28 తేదీల్లో ప్రయాణికులు ఈ కింది రైళ్ల సమయాల్లో జరిగిన మార్పులను గమనించాలి.
27 అక్టోబర్ 2026
రైలు నం. 18464: KSR బెంగళూరు సిటీ జంక్షన్ – భువనేశ్వర్ 180 నిమిషాలు ఆలస్యం
రైలు నం. 22807: సంత్రాగాచి జంక్షన్ – MGR చెన్నై సెంట్రల్ 180 నిమిషాలు
రైలు నం. 17068: బనారస్ – చర్లపల్లి 180 నిమిషాలు
రైలు నం. 12841: హౌరా జంక్షన్ – MGR చెన్నై సెంట్రల్ 240 నిమిషాలు
రైలు నం. 17216: ధర్మవరం జంక్షన్ – మచిలీపట్నం 240 నిమిషాలు
రైలు నం. 12840: MGR చెన్నై సెంట్రల్ – హౌరా జంక్షన్ 300 నిమిషాలు
రైలు నం. 18042: చెన్నై ఎగ్మోర్ – షాలిమార్ 300 నిమిషాలు
రైలు నం. 17481: బిలాస్పూర్ జంక్షన్ – తిరుపతి 360 నిమిషాలు
28 అక్టోబర్ 2026
రైలు నం. 06020: నరసాపురం – తూత్తుకుడి 180 నిమిషాలు రీషెడ్యూల్
రైలు నం. 12805: విశాఖపట్నం – లింగంపల్లి 180 నిమిషాలు
రైలు నం. 12787: నరసాపురం – నాగర్సోల్ 240 నిమిషాలు
ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు రైళ్ల లేటెస్ట్ స్టేటస్ సరిచూసుకుని, అందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


