...
...
Next Story

ఈనెల 20న విశాఖకు ప్రధాని మోదీ - షెడ్యూల్ ఇలా...!

ప్రధాని మోదీ విశాఖకు రానున్నారు. జూన్ 21వ తేదీన జరిగే యోగా వేడుకల్లో పాల్గొనేందుకు ఈనెల 20న విశాఖకు చేరుకుంటారు. ఆ రోజు విశాఖలోనే బస చేస్తారు. మరునాడు ఆర్కే బీచ్‌లో నిర్వహించే యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఢిల్లీకి తిరుగు పయనమవుతారు.

Published on: Jun 15, 2025, 09:53:04 IST
By , , Andhrapradesh, Vizag
Prefer HTon Google
Advertisement

ప్రధానమంత్రి మోదీ విశాఖలో పర్యటించనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా… జూన్ 21న యోగా కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఇందుకోసం జూన్ 20వ తేదీన విశాఖకు చేరుకోనున్నారు.

ప్రధాని మోదీ (ఫైల్ ఫొటో)
ప్రధాని మోదీ (ఫైల్ ఫొటో)

జూన్ 20వ తేదీన భువనేశ్వర్ నుంచి విశాఖ చేరుకోనున్న ప్రధాని మోదీ… ఆ రోజు రాత్రి తూర్పు నౌకాదళ అతిథిగృహంలో బస చేయనున్నారు. మరునాడు ఉదయం 6.30 నుంచి 7.45 వరకు విశాఖలోని ఆర్కే బీచ్ లో జరిగే యోగాడేలో పాల్గొననున్నారు. రాష్ట్ర సీఎం చంద్రబాబు కూడా ఈ ఈవెంట్ లో భాగమవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీ తిరిగి ఢిల్లీకి వెళ్తారు.

గిన్నిస్ రికార్డే లక్ష్యంగా …!

జూన్ 21 ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజును భారీ స్థాయిలో యోగా కార్యక్రమాలను చేపట్టనుంది. ఒక్క విశాఖలోనే ఒకే రోజు 5 లక్షల మంది యోగా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్కే బీచ్ లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు పాల్గొంటారు.

మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది లక్ష కేంద్రాల్లో యోగా సాధన చేసి గిన్నిస్వరల్డ్ రికార్డ్ సృష్టించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఉంది. 25 లక్షల మందికి యోగా సర్టిఫికెట్లు అందజేయాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. లక్ష కేంద్రాల్లో యోగా సాధన చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.

యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా యోగాఅవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు. విశాఖపట్నంలోని ఆర్‌కె బీచ్ నుండి భీమిలి బీచ్ వరకు జ‌రిగే యోగా ప్రదర్శనలో భారీ ఎత్తున ప్రజలు భాగస్వాములవుతారని అధికారులు భావిస్తున్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగమయ్యేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. yogandhra.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks