మాజీ మంత్రి అంబటి రాంబాబును కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. బెయిల్ వచ్చిందనే సంబరపడేలోపే.. మరో కేసు మెడకు చుట్టుకుంది. అంబటిపై గుంటూరు నమోదైన కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో అంబటి అనుచరులు ఆనందపడ్డారు. కానీ ఆయనపై మరో పీటీ వారెంట్ జారీ అయింది. గతంలో నమోదైన చీటింగ్ కేసుకు సంబంధించి సత్తెనపల్లి పోలీసులు ఆయనను గుంటూరు ప్రిన్సిపల్ సబ్ కోర్టులో హాజరుపరచనున్నారు.

సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ లాటరీ ముసుగులో రాంబాబు వసూళ్లకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఫిర్యాదులు అందాయి. అతని నాయకత్వంలో లాటరీ టిక్కెట్లు అమ్ముడయ్యాయని, గ్రామ/వార్డ్ సచివాలయ సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు ఈ టిక్కెట్ల అమ్మకాలను సులభతరం చేశారని ఆరోపణలు వచ్చాయి.
2023లో సంక్రాంతి లక్కీ డ్రా లాటరీ టిక్కెట్ల అమ్మకాలకు సంబంధించి జనసేన నాయకులు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. ఆ సమయంలో పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు సబ్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలను అనుసరించి జనవరి 16, 2023న సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్‌లో రాంబాబుపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు తాజా పీటీ వారెంట్ జారీ చేశారు.
అంబటి రాంబాబు మంత్రి హోదాలో సత్తెనపల్లిలో 2023 జనవరిలో సంక్రాంతి సంబరాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన చేసిన డ్యాన్స్ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. తన నియోజకవర్గ పరిధిలో లాటరీ టికెట్లకు డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. పింఛనుదారుల దగ్గర నుంచి రూ.200 చొప్పున తీసుకుని రెండేసి లాటరీ టిక్కెట్లు ఇచ్చారని చర్చ నడిచింది. సంక్రాంతి రోజున లాటరీ తీసి బహుమతులను అందజేశారు. ఇలా లాటరీలు తీయడం చట్టవిరుద్ధమని జనసేన పార్టీ నేత గాదె వెంకటేశ్వరరావు కోర్టును ఆశ్రయించారు. ఆ కేసులోనే తాజాగా పీటీ వారెంట్ జారీ అయ్యింది. ఈ నెల 18లోగా ఆయన్ను కోర్టులో హాజరుపరచనున్నారు.
సీఎం చంద్రబాబును దూషించిన కేసులో అంబటికి బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. అలాగే పట్టాభిపురం పోలీసులపై దౌర్జన్యం చేశారనే కేసులో రిమాండ్ విధించారు. దీంతో ఆయనను మళ్లీ రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. బుధవారం ఈ కేసులో బెయిల్ వచ్చింది. ఈ బెయిల్ పత్రాలను తీసుకుని ఆయన తరఫు న్యాయవాదులు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి వెళ్లారు. ఇదే సమయంలో సంక్రాంతి లాటరీ టికెట్ల వ్యవహారంలో పీటీ వారంట్‌తో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఈ కారణంగా అంబటి రాంబాబును విడుదల చేయలేదు.
{{/usCountry}}సీఎం చంద్రబాబును దూషించిన కేసులో అంబటికి బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. అలాగే పట్టాభిపురం పోలీసులపై దౌర్జన్యం చేశారనే కేసులో రిమాండ్ విధించారు. దీంతో ఆయనను మళ్లీ రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. బుధవారం ఈ కేసులో బెయిల్ వచ్చింది. ఈ బెయిల్ పత్రాలను తీసుకుని ఆయన తరఫు న్యాయవాదులు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి వెళ్లారు. ఇదే సమయంలో సంక్రాంతి లాటరీ టికెట్ల వ్యవహారంలో పీటీ వారంట్‌తో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఈ కారణంగా అంబటి రాంబాబును విడుదల చేయలేదు.
{{/usCountry}}