SCR Radhikapur Bengaluru ExpressTrain Diversion :రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్‌డేట్ ఇచ్చింది. సదరన్ రైల్వే పరిధిలోని మద్రాస్ డివిజన్, అరక్కోణం (AJJ) రైల్వే స్టేషన్‌లో భద్రతా కారణాల దృష్ట్యా నాన్-ఇంటర్‌లాకింగ్ (NI) ప్రోగ్రామ్ పనులు చేపట్టారు. ఈ సాంకేతిక పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే ఒక ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును దారి మళ్లిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

రైల్వే శాఖ విడుదల చేసిన ప్రకటనలోని సమాచారం ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని రాధికాపూర్ నుంచి బెంగళూరు వెళ్లే రాధికాపూర్ – SMVT బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ - 16224) జూన్ 21, 2026 నాటి సర్వీసును దారి మళ్లిస్తారు. ఫలితంగా నిర్దేశిత సాధారణ మార్గానికి బదులుగా దారి మళ్లించిన రూట్‌లో రాకపోకలుంటాయి.
ఈ స్టేషన్లలో ఆగదు….
ఈ తాత్కాలిక మార్పుతో ఆ రైలు తన రెగ్యులర్ రూట్‌లో ఉండే నాలుగు ముఖ్యమైన స్టేషన్లలో ఆగదు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల ప్రయాణికులు ఎక్కువగా ఉపయోగించే నాయుడుపేట, సూళ్లూరుపేట, పెరంబూర్ , అరక్కోణం (AJJ) రైల్వే స్టేషన్లలో ఈ రైలు స్టాపింగ్‌లను అధికారులు పూర్తిగా రద్దు చేశారు. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు గూడూరు నుంచి రేణిగుంట… తిరుత్తణి మీదుగా మేల్పక్కం వైపునకు వెళ్తుంది.
ప్రయాణికులకు ప్రత్యామ్నాయంగా అధికారులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. పైన పేర్కొన్న నాలుగు స్టేషన్ల హాల్ట్‌లు రద్దు చేసినప్పటికీ….. దానికి బదులుగా తిరుత్తణి (TRT) రైల్వే స్టేషన్‌లో ఈ రైలుకు అదనపు స్టాపింగ్ సౌకర్యాన్ని కల్పించారు. జూన్ 21న ప్రయాణించే వారు తిరుత్తణి స్టేషన్ ద్వారా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు.
జూన్ 21వ తేదీన ఈ మార్గంలో ప్రయాణించాలనుకునే ప్రయాణికులు మారిన రూట్, కొత్త స్టాపింగ్ వివరాలను గమనించి, అందుకు అనుగుణంగా తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.
{{/usCountry}}జూన్ 21వ తేదీన ఈ మార్గంలో ప్రయాణించాలనుకునే ప్రయాణికులు మారిన రూట్, కొత్త స్టాపింగ్ వివరాలను గమనించి, అందుకు అనుగుణంగా తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.
{{/usCountry}}