ప్రయాణీకులకు మరింత చేరువయ్యేందుకు వారి ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు రైల్వేశాఖ సరికొత్ సేవలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు అన్‌రిజర్వ్ డ్ టిక్కెట్ల కోసం వాడుతున్న యూటీఎస్ యాప్ సేవను నిలిపివేసి… ఆ స్థానంలో మరో కొత్త యాప్ ను తీసుకురానుంది.
మార్చి 1 నుంచి రైల్ వన్…

రైల్వే శాఖ అందించే అన్ని సేవలను ఒకే చోట అందించేందుకు ‘రైల్‌వన్ యాప్’ను సిద్ధం చేసింది. మార్చి 1వ తేదీ నుంచి ఈ యాప్ ప్రయాణికులను అందుబాటులోకి రానుంది. ప్రయాణీకులు ఇకపై రైల్‌వన్ యాప్‌ను వినియోగించుకోవాలని రైల్వే శాఖ సూచిస్తోంది.
ఈ కొత్త యాప్ ద్వారా టికెట్ రిజర్వేషన్, అన్ రిజర్వ్‌డ్ , ప్లాట్‌ఫాం టికెట్ల కొనుగోలు, పీఎన్‌ఆర్ ఎంక్వయిరీ, జర్నీ ప్లానింగ్, రైల్వే స్టేషన్లలో బోగీల పొజిషన్, రైలు ప్రయాణ స్థితి, రైలు సహాయ సేవలు, ప్రయాణ సమయంలో మీల్స్ బుకింగ్ వంటి పలు సేవలను ఒకే వేదిక ద్వారా పొందే వీలు ఉంటుంది. గతంలో పలు సేవలకు వేర్వేరు యాప్‌లు ఉండేవి. కానీ ప్రయాణికులకు ఒకే చోట ఈ సేవలన్నీ అందించాలనే ఉద్దేశ్యంతో… రైల్ వన్ యాప్ ను సిద్ధం చేసింది.
అండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాపిల్ ఫోన్ యూజర్లు apps.apple.com/in/ నుంచి రైల్ వన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రైల్ వన్‌లో ఒకే లాగిన్, ఒకే పాస్‌వర్డ్‌తో అన్ని సేవలను సులభంగా పొందే వీలుంటుంది. ఈ యాప్‌కు రైల్వే ఈ-వ్యాలెట్‌ను కూడా జోడిస్తారు. ‘సూపర్ యాప్’గా ఇది రైలు ప్రయాణికులకు మెరుగైన సేవలను అందిస్తుందని రైల్వేశాఖ చెబుతోంది.
ప్రయాణంలో ఏదైనా సమస్య వస్తే రైల్మాడద్ ద్వారా వెంటనే ఫిర్యాదు చేసే సదుపాయం కూడా ఈ రైల్ వన్ యాప్ ఉంటుంది. ఇప్పటికే UTS యాప్‌లో కొత్త రిజిస్ట్రేషన్లు, సీజన్ టిక్కెట్ల పునరుద్ధరణను నిలిపివేశారు. ప్రయాణీకులు తమ పాత UTS లేదా IRCTC లాగిన్ వివరాలతోనే రైల్‌వన్ యాప్‌లోకి సులభంగా సైన్-ఇన్ అవ్వొచ్చని అధికారులు సూచిస్తున్నారు.
{{/usCountry}}ప్రయాణంలో ఏదైనా సమస్య వస్తే రైల్మాడద్ ద్వారా వెంటనే ఫిర్యాదు చేసే సదుపాయం కూడా ఈ రైల్ వన్ యాప్ ఉంటుంది. ఇప్పటికే UTS యాప్‌లో కొత్త రిజిస్ట్రేషన్లు, సీజన్ టిక్కెట్ల పునరుద్ధరణను నిలిపివేశారు. ప్రయాణీకులు తమ పాత UTS లేదా IRCTC లాగిన్ వివరాలతోనే రైల్‌వన్ యాప్‌లోకి సులభంగా సైన్-ఇన్ అవ్వొచ్చని అధికారులు సూచిస్తున్నారు.
{{/usCountry}}ఈ యాప్ ద్వారా సెకండ్ల వ్యవధిలోనే ఆన్ రిజర్వుడ్ టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ యాప్ ద్వారా ఆన్ రిజర్వ్ డ్ టికెట్లు బుకింగ్ చేసుకుంటే 3 శాతం డిస్కౌంట్ కూడా పొందొచ్చని వివరిస్తున్నారు.
యూటీఎస్ యాప్ సేవలను నిలిపివేస్తున్న నేపథ్యంలో అందులోని ఆర్-వ్యాలెట్ లోని బ్యాలెన్స్ గురించి ప్రయాణీకులు ఆందోళన చెందొద్దని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు. రైల్‌వన్ యాప్‌లోకి మారినప్పుడు పాత బ్యాలెన్స్ ఆటోమేటిక్‌గా ఇందులో జమవుతుందని పేర్కొంటున్నారు.