ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ, రేపు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణంలో ఏర్పడిన మార్పుల నేపథ్యంలో… వానలు పడే సూచనలున్నాయి.

ప్రస్తుతం ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మరియు జార్ఖండ్ మీదుగా ఈశాన్య ఉత్తరప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉంది. ఇదిలా ఉంటే రేపు దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడొచ్చని…. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 13 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రాబోయే కొన్ని రోజుల పాటు వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం పరిధిలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో (క్షణానికి 50 కిమీ వేగానికి చేరేలా) బలమైన ఈదురుగాలులు వీచే వీలుందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఒకటి రెండు చోట్ల పిడుగులు పడే ముప్పు కూడా ఉందని స్పష్టం చేసింది. రాయలసీమ జిల్లాలో వాతావరణ పరిస్థితి
రాయలసీమ ప్రాంతంలో కూడా ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక్కడ కూడా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు సంభవించే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల వద్ద గానీ నిలబడకూడదని సూచించారు.
తెలంగాణలో పొడి వాతావరణం
మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వెదర్ రిపోర్ట్ చూస్తే… పూర్తిగా పొడి వాతావరణం ఉండనుంది. రాబోయే ఐదారు రోజుల పాటు వర్ష సూచనలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రానికి ఎలాంటి తీవ్ర వాతావరణ హెచ్చరికలు లేవని పేర్కొంది.
మరోవైపు తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. సాయంత్రం దాటితే చలి గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఉదయం సమయంలో పొగమంచు కూడా కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
{{/usCountry}}మరోవైపు తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. సాయంత్రం దాటితే చలి గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఉదయం సమయంలో పొగమంచు కూడా కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
{{/usCountry}}