...
...
Next Story

Weather Report : అల్పపీడనం ఎఫెక్ట్.... తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన, బలమైన గాలులు వీచే ఛాన్స్!

AP Telangana Weather Updates : నైరుతి బెంగాల్ ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. తెలంగాణలో తేలికపాటి వర్షాలు పడే సూచనలున్నాయి.

Published on: Aug 8, 2026, 16:02:47 IST
Advertisement

AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నైరుతి బెంగాల్ మహాసముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం (ఆగస్టు 8, 2026) ఉదయం 08:30 గంటల సమయానికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఎత్తుకు వెళ్లేకొద్దీ ఇది నైరుతి దిశగా వంగి ఉందని ఐఎండీ వివరించింది. ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ, వాయువ్య దిశల నుంచి గాలులు వీస్తున్నట్లు పేర్కొంది.

ఈ అల్పపీడన ప్రభావంతో రాగల ఐదు రోజుల పాటు (ఆగస్టు 8 నుండి ఆగస్టు 12 వరకు) ఆంధ్రప్రదేశ్, యానాం పరిధిలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణ మార్పులు కనిపిస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

  • ఉత్తర కోస్తా : ఈ ప్రాంతాల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే ప్రమాదం ఉందని తెలిపారు.
  • దక్షిణ కోస్తాంధ్ర & రాయలసీమ : ఇక్కడ కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
  • తీరప్రాంతాలతో పాటు రాయలసీమ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశముంది.

తెలంగాణ వెదర్ రిపోర్ట్ :

ఇవాళ(ఆగస్ట్ 8) మరికొన్ని గంటల్లో హైదరాబాద్, భూపాలపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, మేడ్చల్, మంచిర్యాల, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, వికారాబాద్, వనపర్తి, భువనగిరి జిల్లాల్లోతేలికపాటి నుంచి ఉరుములతో కూడిన తేలికపాటి వర్షం పడొచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe