...
...
Next Story

Weather Updates : బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన! ఐఎండీ అంచనాలివే

బంగాళాఖాతంలో రేపటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయి.

Published on: Aug 28, 2026, 17:47:57 IST
Advertisement

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 24 గంటల్లో మరో అల్పపీడనం బలపడనుంది. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ - ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల పరిధిలో శనివారానికి (ఆగస్టు 29, 2026) ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రాగల కొద్ది రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష సూచన…

తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు

అల్పపీడన ప్రభావంతో శనివారం నాడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. అలాగే ఉత్తరాంధ్రలోని మిగతా జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. వర్షాల సమయంలో ఉరుములు, పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడకూడదని అధికారులు హెచ్చరించారు.

తెలంగాణ వాతావరణ బులెటిన్

ఇక ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 3 వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఆగస్టు 28, 29 తేదీల్లో రాష్ట్రంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఆ తర్వాతి రోజుల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదు కానున్నాయి. అయితే ఎలాంటి తీవ్రమైన ముప్పు హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks