తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటన కలకలం రేపింది. లాలాచెరువు ప్రాంతంలోని చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్‌లో ఒకేసారి పలువురు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. బాధితులకు కిడ్నీలు పాడైనట్లు తెలుస్తోంది.. దీనంతటకి కల్తీ పాలే కారణమన్న అనుమానాలు బాధితులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు.

'ఈ ఘటన చాలా బాధకరం. లాలాచెరువు ప్రాంతంలో నలుగురు చనిపోయారు. ఎనిమిది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం. వరలక్ష్మీ డెయిరీకి చెందిన కల్తీ పాల వలనే పలువురు అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. సెక్షన్ 194 కింద బాధ్యులపై కేసులు నమోదు చేశాం.' అని చంద్రబాబు తెలిపారు.
ఇంటింటా సర్వే : కలెక్టర్
లాలాపేట చెరువు చౌడేశ్వరి నగర్ ప్రాంతంలో ఇంటింటా సర్వే చేస్తున్నట్టుగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. ప్రభుత్వం తరఫున చేపట్టిన చర్యలను వివరించారు. కల్తీ పాలతో అస్వస్థతకు గురైనట్టుగా ఆరోపణలు వచ్చినందున పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామన్నారు. పాలు పోసిన వ్యాపారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా పేర్కొన్నారు.
వ్యాపారి 46 మంది రైతుల దగ్గర పాలు సేకరించి.. 106 కుటుంబాలకు పోశాడని కలెక్టర్ వెల్లడించారు. ఆదివారం రాత్రి నుంచి ఇప్పటిదాకా 73 మంది నుంచి రక్తనమూనాలను సేకరించినట్టుగా చెప్పారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామన్నారు. అస్వస్థతకు గురైన వారిలో ఇప్పటిదాకా నలుగురు మృతి చెందినట్టుగా తెలిపారు. ఎవరైనా అనారోగ్యానికి గురైతే.. కాల్ సెంటర్ 9494060060 ఫోన్ చేసి సమాచారం ఇవ్వొచ్చన్నారు.
'పాల శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం హైదరాబాద్ పంపించాం.. కిడ్నీ సమస్యలతో మరణాలపై విచారణకు రాష్ట్ర నిపుణుల కమిటీ వస్తుంది. కల్తీ పాల కారణంగానే మరణాలు జరిగినట్లు ప్రాథమిక అంచనా. రిపోర్టులు వస్తాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం.' అని కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు.
{{/usCountry}}'పాల శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం హైదరాబాద్ పంపించాం.. కిడ్నీ సమస్యలతో మరణాలపై విచారణకు రాష్ట్ర నిపుణుల కమిటీ వస్తుంది. కల్తీ పాల కారణంగానే మరణాలు జరిగినట్లు ప్రాథమిక అంచనా. రిపోర్టులు వస్తాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం.' అని కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు.
{{/usCountry}}మరోవైపు ఈ ఘటన గురించి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మాట్లాడారు. పాల వ్యాపారి దగ్గర మెటీరియల్‌ను సీజ్ చేశామన్నారు. ప్రజలు సంయమనం పాటించాలని చెప్పారు. నలుగురు మృతి చెందినట్టుగా తెలిపారు, ఇప్పటి వరకు 12 కేసులు నమోదైనట్టుగా వెల్లడించారు.