రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం

రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనను సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రస్తావించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.

Published on: Feb 23, 2026, 15:16:46 IST
By , Amaravati
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటన కలకలం రేపింది. లాలాచెరువు ప్రాంతంలోని చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్‌లో ఒకేసారి పలువురు తీవ్ర అనారోగ్యంతో ఆసుప‌త్రి పాలయ్యారు. బాధితుల‌కు కిడ్నీలు పాడైన‌ట్లు తెలుస్తోంది.. దీనంత‌ట‌కి క‌ల్తీ పాలే కార‌ణ‌మ‌న్న అనుమానాలు బాధితులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు.

సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

'ఈ ఘటన చాలా బాధకరం. లాలాచెరువు ప్రాంతంలో నలుగురు చనిపోయారు. ఎనిమిది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం. వరలక్ష్మీ డెయిరీకి చెందిన కల్తీ పాల వలనే పలువురు అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. సెక్షన్ 194 కింద బాధ్యులపై కేసులు నమోదు చేశాం.' అని చంద్రబాబు తెలిపారు.

ఇంటింటా సర్వే : కలెక్టర్

లాలాపేట చెరువు చౌడేశ్వరి నగర్‌ ప్రాంతంలో ఇంటింటా సర్వే చేస్తున్నట్టుగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. ప్రభుత్వం తరఫున చేపట్టిన చర్యలను వివరించారు. కల్తీ పాలతో అస్వస్థతకు గురైనట్టుగా ఆరోపణలు వచ్చినందున పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామన్నారు. పాలు పోసిన వ్యాపారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా పేర్కొన్నారు.

వ్యాపారి 46 మంది రైతుల దగ్గర పాలు సేకరించి.. 106 కుటుంబాలకు పోశాడని కలెక్టర్ వెల్లడించారు. ఆదివారం రాత్రి నుంచి ఇప్పటిదాకా 73 మంది నుంచి రక్తనమూనాలను సేకరించినట్టుగా చెప్పారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామన్నారు. అస్వస్థతకు గురైన వారిలో ఇప్పటిదాకా నలుగురు మృతి చెందినట్టుగా తెలిపారు. ఎవరైనా అనారోగ్యానికి గురైతే.. కాల్ సెంటర్ 9494060060 ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వొచ్చన్నారు.

'పాల శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం హైదరాబాద్ పంపించాం.. కిడ్నీ సమస్యలతో మరణాలపై విచారణకు రాష్ట్ర నిపుణుల కమిటీ వస్తుంది. కల్తీ పాల కారణంగానే మరణాలు జరిగినట్లు ప్రాథమిక అంచనా. రిపోర్టులు వస్తాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం.' అని కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు.

మరోవైపు ఈ ఘటన గురించి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మాట్లాడారు. పాల వ్యాపారి దగ్గర మెటీరియల్‌ను సీజ్ చేశామన్నారు. ప్రజలు సంయమనం పాటించాలని చెప్పారు. నలుగురు మృతి చెందినట్టుగా తెలిపారు, ఇప్పటి వరకు 12 కేసులు నమోదైనట్టుగా వెల్లడించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More