రాజమహేంద్రవరం కల్తీ ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. ఆక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ ఘటన నేపథ్యంలో కోరుకొండ మండలం నరసాపురం గ్రామాన్ని ఆరోగ్య శాఖ కమిషనర్ జి.వీర పాండ్యన్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, డీఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, ఇతర వైద్యాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు.

ఈ సందర్భంగా గ్రామంలో సమగ్రంగా ఫ్యాక్ట్ ఫైండింగ్ ప్రక్రియను మరోసారి సమీక్షించారు. తాగునీరు, పాలు, ఇతర ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపినట్లు అధికారులు తెలిపారు. ప్రజల్లో ఎలాంటి ఆందోళన అవసరం లేదని, జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. ఆరోగ్య శాఖ బృందాలు ఇంటింటా సర్వే నిర్వహిస్తూ, లక్షణాలు గమనించిన వెంటనే వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
అత్యవసర సహాయం లేదా ఫిర్యాదుల కోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ 9494060060 ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ప్రజలు అపోహలకు లోనుకాకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని విజ్ఞప్తి చేశారు కలెక్టర్.
రాజమహేంద్రవరంలో చోటుచేసుకున్న ఆక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించి, బాధితులకు అండగా నిలిచింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు యంత్రాంగం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. కిమ్స్, రెయిన్బో వంటి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల సంపూర్ణ వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఘటనకు గల కారణాలను విశ్లేషించడానికి సాంకేతిక నిపుణుల కమిటీని నియమించారు. కల్తీ లేదా ఇతర లోపాలపై కఠిన విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ప్రజలు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. అత్యవసర సహాయం లేదా సమాచారం కోసం ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది.
{{/usCountry}}ప్రజలు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. అత్యవసర సహాయం లేదా సమాచారం కోసం ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది.
{{/usCountry}}