...
...
Next Story

రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగిన వారికి యాంటీ డోట్ ఇంజెక్షన్లు!

రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగిన ఘటనలో పలువురు ఇంకా చికిత్స పొందుతున్నారు. వారికి యాంటీ డోట్ ఇంజెక్షన్లు ఇవ్వాలని వైద్యలు చూస్తున్నారు.

Published on: Feb 26, 2026, 08:20:42 IST
By , Rajamahendravaram
Prefer HTon Google
Advertisement

తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం కల్తీ పాలు తాగిన తర్వాత ఆరోగ్య సమస్యలు తలెత్తిన రోగులకు యాంటీ డోట్ కొనుగోలు చేసింది. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం రాజమహేంద్రవరంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో.. ఈ ఇంజెక్షన్లు ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో లేవని, ఆంధ్రప్రదేశ్ వెలుపలి వైద్య సంస్థల ద్వారా వీటిని సేకరిస్తున్నామని తెలిపారు. సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవి రాజు సలహా ఆధారంగా చికిత్స ప్రోటోకాల్‌లో భాగంగా రోగులకు విరుగుడు మందులు ఇస్తారు.

రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన
రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన

నివాసితులకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే సమీపంలోని వైద్య శిబిరాన్ని సందర్శించాలని కలెక్టర్ సూచించారు. వైద్య చికిత్సకు సంబంధించిన సమాచారం కోసం హెల్ప్‌లైన్ నంబర్ 9494060060 కు కూడా కాల్ చేయవచ్చని చెప్పారు. జిల్లా యంత్రాంగం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ, బాధిత వారికి అవసరమైన అన్ని వైద్య సహాయం అందేలా చూస్తుందని ఆమె అన్నారు.

అయితే ఈ యాంటీ డోట్ ఇంజెక్షన్లు వచ్చినట్టుగా తెలుస్తోంది. బాధితుల చికిత్స కోసం యాంటీడోట్ తెప్పించినట్టుగా అధికారులు చెబుతున్నారు. కల్తీ పాల ఘటనలో సుమారు 15 మంది వరుక బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్‌పై ఇద్దరు, ముగ్గురికి డయాలసిస్, మరో ముగ్గురిని వెంటిలేటర్‌పై ఉంచి డయాలసిస్, ఏడుగురిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

అయితే పాలలో ఎలాంటి పదార్థాలు కలిశాయో తెలియాల్సి ఉంది. ఆ తర్వాత యాంటీ డోట్ ఇంజెక్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. కల్తీ పాలు తాగి 21 మంది ఆస్పత్రుల్లో చేరారు. ఇప్పటికే ఆరుగురు మృతి చెందారు. ప్రస్తుతం 15 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

రాజమండ్రిలో కల్తీ పాల ఘటన నేపథ్యంలో ప్రభుత్వం యంత్రాంగం అప్రమత్తమైంది. అన్ని జిల్లాలోని పలు పాల సేకరణ కేంద్రాలు, డెయిరీ ఫామ్‌ల వద్ద ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. పాలలో యూరియా, డిటర్జెంట్ వంటి హానికర పదార్థాలు కలుస్తున్నాయా అనే కోణంలో తనిఖీలు చేసి, పలు పాల శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించింది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల సంపూర్ణ వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఘటనకు గల కారణాలను విశ్లేషించడానికి సాంకేతిక నిపుణుల కమిటీని నియమించారు. కల్తీ లేదా ఇతర లోపాలపై కఠిన విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe