...
...
Next Story

Rakhi Special Trains 2026 : రాఖీ పండగ వేళ శుభవార్త... విశాఖ - విజయవాడ మధ్య ప్రత్యేక జన సాధారణ్ రైళ్లు…!

Rakhi Special Trains 2026 : రక్షాబంధన్ పండగ, వారాంతపు రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం-విజయవాడ మధ్య ప్రత్యేక జన సాధారణ్ రైళ్లను దక్షిణ కోస్తా రైల్వే ప్రకటించింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.

Published on: Aug 27, 2026, 20:20:14 IST
Advertisement

రాఖీ పౌర్ణమి పండుగతో పాటు వారాంతపు సెలవుల (వీకెండ్) కారణంగా ప్రయాణికుల నుంచి వచ్చే భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ కోస్తా రైల్వే (విజయవాడ డివిజన్) ప్రయాణికులకు తీపి కబురు అందించింది. విశాఖపట్నం - విజయవాడ మార్గంలో ప్రయాణించే వారి సౌకర్యార్థం ప్రత్యేక 'జన సాధారణ్' ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. 2026 ఆగస్టు 28వ తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు మొత్తం 3 ట్రిప్పుల పాటు ఈ ప్రత్యేక సేవలు అందుబాటులో ఉంటాయి.

రాఖీ ప్రత్యేక రైళ్లు
రాఖీ ప్రత్యేక రైళ్లు

ఈ ప్రత్యేక సర్వీసులు ఆగస్టు 28 నుంచి ఆగస్టు 30 వరకు మొత్తం 3 రోజులు (3 ట్రిప్పులు) ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఈ రైలులో 10 జనరల్ సెకండ్ క్లాస్ బోగీలతో పాటు 2 లగేజ్-కమ్-బ్రేక్ వ్యాన్‌లు (SLR) కలిపి మొత్తం 12 ICF కోచ్‌లను ఏర్పాటు చేశారు.

  • విశాఖపట్నం - విజయవాడ (రైలు నంబర్ 07215) : ఈ ప్రత్యేక రైలు విశాఖపట్నంలో ఉదయం 08:30 గంటలకు బయలుదేరి, అదే రోజు సాయంత్రం 16:00 గంటలకు (4:00 PM) విజయవాడ చేరుకుంటుంది.
  • విజయవాడ - విశాఖపట్నం (రైలు నంబర్ 07216) : తిరుగు ప్రయాణంలో ఈ రైలు విజయవాడలో సాయంత్రం 19:00 గంటలకు (7:00 PM) బయలుదేరి… అర్ధరాత్రి దాటాక 00:45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

రైళ్లు ఆగే ప్రధాన స్టేషన్లు…

ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లకు పలు ముఖ్యమైన స్టేషన్లలో నిలుపుదల కల్పించారు. దువ్వాడ, అనకాపల్లి, నర్సీపట్నం రోడ్, తుని, పిఠాపురం, సామర్లకోట, అనపర్తి, ద్వారపూడి, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, భీమడోలు, ఏలూరు, నూజివీడు స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి. పండగ సమయంలో సొంత ఊళ్లకు వెళ్లేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని దక్షిణ కోస్తా రైల్వే కోరింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe