...
...
Next Story

ఆంధ్రప్రదేశ్‌లో మారిన రంజాన్ సెలవు దినం.. టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ ఎగ్జామ్ తేదీ మార్పు!

ఆంధ్రప్రదేశ్‌లో రంజాన్ సెలవు దినాన్ని మార్చారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

Published on: Mar 20, 2026, 07:12:38 IST
Advertisement

రంజాన్ సందర్భంగా ప్రభుత్వం ప్రటించిన సెలవు దినం శుక్రవారానికి బదులు ఈనెల 21వ తేది శనివారానికి మారుస్తూ జీఓ ఆర్టీ సంఖ్య:612 ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ఈనెల 20వ తేదీ శుక్రవారం సెలవు దినంగా ప్రభుత్వం గతంలో ప్రకటించడం జరిగింది.

మారిన రంజాన్ సెలవు దినం
మారిన రంజాన్ సెలవు దినం

అయితే శుక్రవారం నెలవంక కనిపించని కారణంగా వక్ఫ్ బోర్డు ముఖ్య కార్య నిర్వహణాధికారి విజ్ఞప్తి మేరకు రంజాన్ సాధారణ సెలవును ఈనెల 20వ తేది శుక్రవారానికి బదులు 21వ తేదీ శనివారానికి మార్చినట్టు ఆయన వెల్లడించారు. 20వ తేది శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలన్నీ యథావిధిగా పనిచేస్తాయని సీఎస్ స్పష్టం చేశారు.

అదే విధంగా షాపులు, ఇతర ఎస్టాబ్లిష్మెంట్లకు సంబంధించి నెగోషియబుల్ ఇనుస్ట్రమెంట్ యాక్ట్ 1881కు అనుగుణంగా రంజాన్ సాధారణ సెలవును 20వ తేది శుక్రవారానికి బదులుగా 21వ తేది శనివారానికి మారుస్తూ జీఓఆర్టి సంఖ్య:613 ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

రంజాన్ సెలవు మార్పు కావడంతో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ కూడా మారింది. ఈ నెల 21వ తేదీన జరగాల్సిన పదో తరగతి ఇంగ్లీష్ పరీక్షను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేశారు. మెుదట ఈ నెల 20వ తేదీ శుక్రవారం షెడ్యూల్ ప్రకారం జరగాలి. కానీ ఈనెల 20వ తేదీన రంజాన్ సెలవుగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ నెల 21వ తేదీ శనివారానికి మార్చారు. కానీ ప్రభుత్వం మార్చి 21ని సెలవు దినంగా మార్చడంతో పరీక్షలు అన్ని ముగిసిన తర్వాత.. ఏప్రిల్‌ 2వ తేదీన నిర్వహించనున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe