గ్రీన్ ఎనర్జీకి రాయలసీమ అత్యంత అనుకూలమైన ప్రాంతం : మంత్రి గొట్టిపాటి

గ్రీన్ ఎనర్జీకి రాయలసీమ అత్యంత అనుకూలమైన ప్రాంతం అని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. ప్రతీ వినియోగదారునికి 24 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా ప్రభుత్వ లక్ష్యమన్నారు.

Published on: Dec 21, 2025, 20:19:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తిరుపతి నగరంలో పర్యటించారు. ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఎస్.ఆర్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన ఎనర్జీ ఎగ్జిబిషన్‌కు హాజరైన మంత్రి, విద్యార్థులు రూపొందించిన నూతన ఆవిష్కరణలను ఆసక్తిగా తిలకించారు. ఇంధన పొదుపు, గ్రీన్ ఎనర్జీ, స్మార్ట్ టెక్నాలజీలపై ఆధారపడి రూపొందించిన ప్రాజెక్టుల వివరాలను విద్యార్థులు స్వయంగా మంత్రికి వివరించారు. విద్యార్థుల్లో కనిపించిన సృజనాత్మకతను మంత్రి ప్రశంసిస్తూ, భవిష్యత్తు ఇంధన రంగానికి ఇవి దిశానిర్దేశకంగా నిలుస్తాయని అన్నారు.

ఎగ్జిబిషన్‌లో విద్యార్థులతో మంత్రి గొట్టిపాటి
ఎగ్జిబిషన్‌లో విద్యార్థులతో మంత్రి గొట్టిపాటి

ఎగ్జిబిషన్ సందర్భంగా పీఎం సూర్యఘర్, కుసుమ్, స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టులను మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ పథకాలకు మరింత విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులకు సూచించారు. కూటమి ప్రభుత్వం విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు కట్టుబడి ఉందని, కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ఇన్నోవేషన్ హబ్‌ను తీసుకొచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇంధన రంగంలో నూతన ఆలోచనలతో ముందుకు వచ్చే యువతకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు.

జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన క్విజ్, వక్తృత్వం, వ్యాసరచన పోటీల్లో విజేతలకు మంత్రి బహుమతులు అందజేశారు. అనంతరం నిర్వహించిన ముగింపు సభలో మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ ఎనర్జీని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే గ్రీన్ ఎనర్జీ అభివృద్ధికి రాయలసీమ అత్యంత అనుకూలమైన ప్రాంతమని పేర్కొన్నారు. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ జిల్లాల్లో సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు.

భవిష్యత్తు విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తున్నామని, పగటిపూట ఉత్పత్తయ్యే సౌర విద్యుత్‌ను బ్యాటరీ స్టోరేజ్ సిస్టం ద్వారా భద్రపరిచి అవసరానికి వినియోగిస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి వినియోగదారుడికి 24 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

'పీఎం సూర్యఘర్ పథకం ద్వారా కరెంట్ బిల్లులను తగ్గించుకోవచ్చు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సబ్సిడీ కూడా అందుతుందని ప్రజలకు అవగాహన కల్పించాలి. తిరుపతి పరిసర ప్రాంతాల్లో విద్యుత్ శాఖ చేపడుతున్న ప్రాజెక్టులను విద్యార్థులు సందర్శించేలా అనుమతి ఇవ్వాలి. విద్యార్థుల ప్రతిభను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.' అని మంత్రి గొట్టిపాటి వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటీ, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More