ఏపీకి రెడ్ అలర్ట్ - రాగల 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు!

AP Weather Updates : ఏపీలోని పలు జిల్లాలకు విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాగల మూడు గంటల్లో అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 

Published on: May 23, 2026, 16:37:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP Weather Updates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తీవ్రమైన ఎండల తీవ్రత మధ్య ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం అలుముకుంది. రాగల మూడు గంటల్లో అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ బులెటిన్ విడుదల చేసింది.

ఏపీకి రెడ్ అలర్ట్ : రాగల 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు!
ఏపీకి రెడ్ అలర్ట్ : రాగల 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు!

ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ …

ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాలలో వాతావరణం వేగంగా మారుతోంది. రాగల మూడు గంటల్లో ముఖ్యంగా మూడు జిల్లాల్లో ప్రకృతి బీభత్సం సృష్టించే అవకాశం ఉంది.

  • అల్లూరి సీతారామరాజు జిల్లా
  • అనకాపల్లి జిల్లా
  • కాకినాడ జిల్లా

ఈ మూడు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అత్యంత ముఖ్యంగా ఈ జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.

మరోవైపు విజయనగరం జిల్లా పరిసర ప్రాంతాలలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ఈ జిల్లాలో రాగల మూడు గంటల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. అక్కడక్కడా ఉరుములు పడే అవకాశం ఉన్నందున స్థానిక యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సూచించింది.

వర్షంతో పాటు రాష్ట్రంలో బలమైన ఈదురుగాలులు వీచనున్నాయి. ఈ విపత్కర సమయంలో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) ప్రఖర్ జైన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. గాలుల తీవ్రతకు బలహీనంగా ఉన్న నిర్మాణాలు, చెట్ల కొమ్మలు విరిగిపడే అవకాశం ఉందన్నారు.

"ప్రకృతి వైపరీత్యం సంభవించేటప్పుడు ప్రజల ప్రాణ రక్షణే మాకు ముఖ్యం. బలమైన గాలులు, పిడుగుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలెవరూ అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రాకూడదు. పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి" అని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.

  • చెట్ల కింద నిలబడవద్దు : వర్షం పడేటప్పుడు లేదా పిడుగులు వచ్చేటప్పుడు పొరపాటున కూడా పెద్ద పెద్ద చెట్ల కింద ఆశ్రయం పొందకూడదు. పిడుగులు ఎక్కువగా చెట్లపైనే పడే అవకాశం ఉంది.
  • విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలి : ఈదురు గాలుల వల్ల విద్యుత్ వైర్లు తెగిపడే ప్రమాదం ఉంది. అందువల్ల వీధుల్లోని విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల దరిదాపుల్లోకి వెళ్లకూడదు.
  • హోర్డింగ్స్ కింద ఆగవద్దు : రహదారుల పక్కన ఉండే భారీ అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్, ఫ్లెక్సీలు బలమైన గాలులకు విరిగి కిందపడే ప్రమాదం ఉంది. బైక్‌లపై వెళ్లే ప్రయాణికులు వీటి కింద నిలబడకూడదు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితులను జిల్లాల కలెక్టర్లు, స్థానిక రెవెన్యూ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర సహాయం కోసం నియమిత కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించాలని అధికారులు కోరారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More