రాయలసీమలో పెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈసారి సందడి కరువైంది. ఏటా ఈ సీజన్ ప్రారంభంలో వేలాది క్వింటాళ్ల ఉల్లిపాయలు, ఇతర ధాన్యాలతో కిటకిటలాడే యార్డు, ప్రస్తుతం వెలవెలబోతోంది. వర్షాభావ పరిస్థితులు, విపరీతమైన ఎల్ నినో ప్రతికూల వాతావరణ ప్రభావం వల్ల పంటల సాగు తగ్గడం, ఫలితంగా ఉత్పత్తి దారుణంగా పడిపోవడమే దీనికి ప్రధాన కారణమని వ్యాపారులు వెల్లడిస్తున్నారు.

గతేడాది సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 మధ్య కాలంలో కర్నూలు యార్డుకు సుమారు 1.46 లక్షల క్వింటాళ్ల ఉల్లి విక్రయానికి వచ్చింది. అయితే ఈ ఏడాది అదే సమయానికి మార్కెట్‌కు వచ్చిన ఉల్లి పరిమాణం 40,000 క్వింటాళ్లకు కూడా చేరుకోలేదు. గతేడాదితో పోలిస్తే ఇది 30 శాతం కంటే తక్కువగా ఉండటం గమనార్హం.
సరిపడా దిగుబడులు లేకపోవడం, మార్కెట్‌కు ఉల్లి రాక తగ్గడంతో బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.70 కి చేరుకుంది. భవిష్యత్తులో సరఫరా పరిస్థితులు మెరుగుపడకపోతే, రాబోయే రోజుల్లో ఉల్లి ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏటా ఉల్లి సాగు, దిగుబడి గణనీయంగా తగ్గింది. ఆ ప్రభావం మార్కెట్‌కు వచ్చే సరుకుపై స్పష్టంగా కనిపిస్తోంది. ఉల్లి రాక ఇలాగే తక్కువగా ఉంటే రాబోయే రోజుల్లో ధరలు మరింత ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందని రైతులు తెలిపారు. కేవలం ఉల్లిపాయలు మాత్రమే కాదు, మార్కెట్‌కు వచ్చే చిరుధాన్యాలు, నూనెగింజల రాక కూడా దారుణంగా పడిపోయింది. ముఖ్యంగా సజ్జల పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది.
గతేడాది ఇదే సమయంలో మార్కెట్‌కు 1,700 క్వింటాళ్లకు పైగా సజ్జలు రాగా, ఈ ఏడాది ఇప్పటివరకు కనీసం ఒక్క కిలో సజ్జలు కూడా మార్కెట్‌కు రాలేదని వ్యాపారులు వాపోతున్నారు. కర్నూలు మార్కెట్ అధికారుల గణాంకాల ప్రకారం, గతేడాది సీజన్‌లో అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులు కలిపి మొత్తం 1.80 లక్షల క్వింటాళ్ళు యార్డుకు వచ్చాయి. కానీ ఈ ఏడాది వర్షాభావం కారణంగా పంటల దిగుబడి తగ్గి, ఉత్పత్తుల రాక కేవలం 48,000 క్వింటాళ్లకు మాత్రమే పరిమితమైంది. సాగు విస్తీర్ణం తగ్గడం వల్ల ఉల్లితో పాటు ఇతర నిత్యావసర ధాన్యాల కొరత తీవ్రమై, రాబోయే వారాల్లో మార్కెట్‌లో ధరలు ఆకాశాన్నంటే అవకాశం ఉందని వ్యాపారులు, వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
{{/usCountry}}గతేడాది ఇదే సమయంలో మార్కెట్‌కు 1,700 క్వింటాళ్లకు పైగా సజ్జలు రాగా, ఈ ఏడాది ఇప్పటివరకు కనీసం ఒక్క కిలో సజ్జలు కూడా మార్కెట్‌కు రాలేదని వ్యాపారులు వాపోతున్నారు. కర్నూలు మార్కెట్ అధికారుల గణాంకాల ప్రకారం, గతేడాది సీజన్‌లో అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులు కలిపి మొత్తం 1.80 లక్షల క్వింటాళ్ళు యార్డుకు వచ్చాయి. కానీ ఈ ఏడాది వర్షాభావం కారణంగా పంటల దిగుబడి తగ్గి, ఉత్పత్తుల రాక కేవలం 48,000 క్వింటాళ్లకు మాత్రమే పరిమితమైంది. సాగు విస్తీర్ణం తగ్గడం వల్ల ఉల్లితో పాటు ఇతర నిత్యావసర ధాన్యాల కొరత తీవ్రమై, రాబోయే వారాల్లో మార్కెట్‌లో ధరలు ఆకాశాన్నంటే అవకాశం ఉందని వ్యాపారులు, వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
{{/usCountry}}