ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో తాగునీటి భద్రతకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అందులో భాగంగానే రాయలసీమ ప్రాంత తాగునీటి అవసరాల దృష్ట్యా శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులకు నీటి విడుదల చేపడుతున్నామని పేర్కొన్నారు.

ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 119 టీఎంసీల నీరు అందుబాటులో ఉండగా, రానున్న పది రోజుల్లో మరో 100 టీఎంసీల వరకు ఇన్‌ఫ్లో వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు మంత్రి నిమ్మల. ఎల్ నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని 2027 జూన్ వరకు శ్రీశైలం జలాలను ప్రధానంగా తాగునీటి అవసరాల కోసం భద్రపరిచే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న 63 శాతం వాటాలో తొలి ప్రాధాన్యత తాగునీటికే ఇస్తున్నట్లు చెప్పారు. హంద్రీనీవా పరిధిలోని రిజర్వాయర్ల తాగునీటి అవసరాల కోసం 13 టీఎంసీలు, పోతిరెడ్డిపాడు పరిధిలోని రిజర్వాయర్లకు 10 టీఎంసీల నీటిని రేపటి నుంచి విడుదల చేయనున్నామని తెలిపారు.
తెలుగుగంగ ద్వారా చెన్నై నగర తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉందని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువల పరిధిలోని తాగునీటి అవసరాల కోసం 32 టీఎంసీల నీరు అవసరమని అన్నారు. ఎల్ నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి వారం పరిస్థితిని సమీక్షిస్తూ, వర్షపాతం, వరదల పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించామని అన్నారు. జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి రాష్ట్రంలో తాగునీటి భద్రతకు చర్యలు చేపట్టాలని సూచించారు.
'కృష్ణా జలాల్లో మన ఏపీ 63 శాతం వాటాను ముఖ్యంగా తాగునీటికే ప్రాధాన్యత ఇస్తున్నాం. శ్రీశైలం రిజర్వాయర్ నీటిని ఎల్ నినో దృష్ట్యా, ప్రధమ ప్రాధాన్యతగా తాగునీటికి విడుదల చేస్తున్నాం. హంద్రీనీవా పరిధిలోని రిజర్వాయర్స్ తాగునీటి అవసరాల కోసం, 13 టీఎంసీలు అవసరం. పోతిరెడ్డిపాడు పరిధిలోని రిజర్వాయర్లకు తాగునీటి కోసం 10 టీఎంసీలు గురువారం నుండి విడుదల చేస్తున్నాం. తెలుగుగంగ ద్వారా చెన్నై తాగునీటికై 10 టీఎంసీల నీరు విడుదల చేయాల్సి ఉంది. నాగార్జున సాగర్, రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ పరిధి తాగునీటికి 32 టీఎంసీలు అవసరం. వారం, వారం సమీక్ష చేసుకుని ఎల్ నినో విపత్తును ఎదుర్కొనే విధంగా వర్షాలు, వరదలు ఆధారంగా ప్రణాళికాబద్దంగా చర్యలు చేపడతాం. జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ నీటి భద్రతకు చర్యలు చేపట్టాలి.' అని మంత్రి నిమ్మల పేర్కొన్నారు.
{{/usCountry}}'కృష్ణా జలాల్లో మన ఏపీ 63 శాతం వాటాను ముఖ్యంగా తాగునీటికే ప్రాధాన్యత ఇస్తున్నాం. శ్రీశైలం రిజర్వాయర్ నీటిని ఎల్ నినో దృష్ట్యా, ప్రధమ ప్రాధాన్యతగా తాగునీటికి విడుదల చేస్తున్నాం. హంద్రీనీవా పరిధిలోని రిజర్వాయర్స్ తాగునీటి అవసరాల కోసం, 13 టీఎంసీలు అవసరం. పోతిరెడ్డిపాడు పరిధిలోని రిజర్వాయర్లకు తాగునీటి కోసం 10 టీఎంసీలు గురువారం నుండి విడుదల చేస్తున్నాం. తెలుగుగంగ ద్వారా చెన్నై తాగునీటికై 10 టీఎంసీల నీరు విడుదల చేయాల్సి ఉంది. నాగార్జున సాగర్, రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ పరిధి తాగునీటికి 32 టీఎంసీలు అవసరం. వారం, వారం సమీక్ష చేసుకుని ఎల్ నినో విపత్తును ఎదుర్కొనే విధంగా వర్షాలు, వరదలు ఆధారంగా ప్రణాళికాబద్దంగా చర్యలు చేపడతాం. జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ నీటి భద్రతకు చర్యలు చేపట్టాలి.' అని మంత్రి నిమ్మల పేర్కొన్నారు.
{{/usCountry}}