టూరిస్టులకు శుభవార్త - పాపికొండల విహారయాత్ర పునఃప్రారంభం..!

Papikondalu Boat Tourism : అర్నబ్ తుఫాను కారణంగా నిలిచిపోయిన ప్రసిద్ధ పాపికొండల బోటు ప్రయాణాలను అధికారులు తిరిగి ప్రారంభించారు. గండిపోశమ్మ, పోచవరం పాయింట్ల నుంచి బోటు సర్వీసులు పర్యాటకులకు అందుబాటులోకి వచ్చాయి.

Published on: Nov 10, 2026, 13:42:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Papikondalu Boat Tourism : ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ తీపి కబురు అందించింది. ఎంతో ప్రాచుర్యం పొందిన ప్రసిద్ధ పాపికొండల విహారయాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. గత నెల 26వ తేదీన సంభవించిన 'అర్నబ్' తుఫాను తీవ్ర ప్రభావం కారణంగా గోదావరి నదిలో పర్యాటక బోటు ప్రయాణాలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

పాపికొండలు (HT Telugu Photo)
పాపికొండలు (HT Telugu Photo)

ప్రస్తుతం నదీ పరివాహక ప్రాంతంలో వాతావరణం అనుకూలించడంతో పాటు ప్రవాహం సాధారణ స్థితికి రావడంతో తిరిగి బోటు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు.

పోలవరం జిల్లాలోని గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో కొలువుదీరిన పాపికొండలు ప్రకృతి రమణీయతకు నిలయం. పచ్చని అడవులు, ఎత్తైన కొండల నడుమ పరవళ్లు తొక్కే గోదావరి నదిలో సాగే పడవ ప్రయాణం పర్యాటకులకు మైమరిపించే అనుభూతిని అందిస్తుంది. అయితే….. అర్నబ్ తుఫాను సృష్టించిన అలజడితో గోదావరిలో నీటి ప్రవాహం పెరిగి పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. దీంతో పర్యాటకుల ప్రాణ భద్రతకే మొదటి ప్రాధాన్యం ఇస్తూ అధికారులు యాత్రను కొద్దిరోజుల కిందట తాత్కాలికంగా రద్దు చేశారు. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా సద్దుమణగడంతో విహారయాత్రను పునఃప్రారంభించారు.

బోటింగ్ పాయింట్స్…

పాపికొండల యాత్ర పునఃప్రారంభమైన నేపథ్యంలో పర్యాటకుల సౌకర్యార్థం రెండు వేర్వేరు పాయింట్ల నుంచి బోటు సర్వీసులను అధికారులు ఏర్పాటు చేశారు.

  • పోలవరం జిల్లాలోని ప్రసిద్ధ గండిపోశమ్మ ఆలయ ఘాట్ నుంచి కొన్ని బోట్లు బయలుదేరుతాయి.
  • పోచవరం పాయింట్ నుంచి మరికొన్ని బోట్లను అందుబాటులో ఉంచారు.

పర్యాటకులు తమ ప్రయాణ ప్రణాళికకు అనుగుణంగా అనుకూలమైన ప్రాంతం నుంచి పాపికొండల విహారయాత్రను ప్రారంభించే వీలుంది. పాపికొండల యాత్రకు వెళ్లే పర్యాటకులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరారు. ప్రయాణానికి ముందే వాతావరణ పరిస్థితులు, పర్యాటక శాఖ మరియు స్థానిక అధికారుల భద్రతా మార్గదర్శకాలను తెలుసుకోవడం శ్రేయస్కరం. బోటు నిర్వాహకులు అందించే లైఫ్ జాకెట్లను తప్పనిసరిగా ధరించాలని…. అధికారుల సూచనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More