Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్ కాలువ పనులు - రూ. 600 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్
పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 600 కోట్ల అదనపు నిధులను విడుదల చేసింది. కాలువల పనులకు ఇబ్బంది కలగకుండా ఈ నిధులను కేటాయించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం బహుళార్థసాధక నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా నిరంతరాయంగా ముందుకు సాగేలా రూ. 600 కోట్ల అదనపు నిధులను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది.

సింగిల్ నోడల్ ఏజెన్సీ - రాష్ట్రాలకు మూలధన పెట్టుబడుల ప్రత్యేక సహాయం (SNA-SASCI) నిధుల కింద ఈ అమౌంట్‌ను విడుదల చేశారు. పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ (PIPLMC), కుడి ప్రధాన కాలువ (PIPRMC) పనులకు సంబంధించి బకాయి ఉన్న బిల్లుల చెల్లింపుల కోసం ఈ సొమ్మును వినియోగిస్తారు. "సమయం ప్రకారం నిర్దేశించుకున్న ప్రణాళికల మేరకు కాలువల పనులు నిరంతరాయంగా పూర్తి కావడమే లక్ష్యంగా ఈ రూ. 600 కోట్ల బడ్జెట్ రిలీజ్ ఆర్డర్‌ను పోలవరం ప్రాజెక్టు కమిషనర్‌కు జారీ చేశాం," అని ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్ తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
గోదావరి, కృష్ణా డెల్టాలకు మరో రూ. 400 కోట్లు
పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలోని ఇతర కీలక నీటిపారుదల వ్యవస్థల ఆధునీకరణకు కూడా ప్రభుత్వం పెద్దపీట వేసింది. ధవళేశ్వరంలోని గోదావరి డెల్టా వ్యవస్థ, విజయవాడలోని కృష్ణా డెల్టా వ్యవస్థల అభివృద్ధికి రూ. 200 కోట్ల చొప్పున మొత్తం రూ. 400 కోట్ల అదనపు నిధులను కేటాయిస్తూ ఆర్థిక శాఖ మరో రెండు ప్రత్యేక జీవోలను విడుదల చేసింది.
2026-27 ఆర్థిక సంవత్సరంలో గోదావరి డెల్టా వ్యవస్థ ఆధునీకరణ పనులకు సంబంధించి నిలిచిపోయిన బిల్లులను క్లియర్ చేయడానికి ఈ ఎస్ఎన్ఏ-సాస్కీ (SNA-SASCI) నిధులు ఎంతగానో దోహదపడతాయని రోనాల్డ్ రోస్ తెలిపారు. కృష్ణా డెల్టా పరిధిలో కూడా సకాలంలో కాంట్రాక్టర్లకు చెల్లింపులు పూర్తి చేసి…. కాలువల ఆధునీకరణ పనులు నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా చూడటమే ఈదనపు నిధుల కేటాయింపు ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. ఈ నిర్ణయంతో ఆయా పాంతాల ఆయకట్టు రైతులకు సాగునీటి సరఫరా మరింత సులభతరం కానుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

